Pages

31, డిసెంబర్ 2017, ఆదివారం

ఏ కులమూ నికార్సైనది కాదు.

ఇటీవల టివి9 వారు చేసిన స్టింగ్ ఆపరేషన్ ..అదే విజయవాడలో ..కులాల గురుంచి...!మరీ ఇంత దారుణామా అనిపించేలా ఉంది.మా కులం వారికే ఇళ్ళు అద్దె కి ఇస్తాం అనేది చాలా దారుణం.అసలు విజయవాడ అంటేనే కులాల కురుక్షేత్రం.అది చాలా పాపులర్ గాని ఇంత రేంజ్ లో ఉండడం విచిత్రం.ఇలా అయితే కొత్త రాస్ట్రం ఎలా అభివృద్ది చెందుతుంది.రాజధాని అన్నప్పుడు సకల జనాలు ఉంటారు...రకరకాల కారణాల తో.కాబట్టి ఇదే పట్టుకొని కూర్చుంటే పురోగతి శూన్యం.కమ్మ ఇంకా కాపు కులాల్లో ఇంత కుల పట్టుదలలు ఉండటం విచిత్రం గా ఉంది.నాకు తెలిసి ఈ రెండు కులాల్లో విపరీతమైన సంకరం ఉన్నది.అంటే ఇతర కులాల వారిని పెళ్ళి చేసుకోవడం లో...ముఖ్యంగా దళితుల్ని..ఇతర బి.సి.కులాల వారిని చేసుకోవడం లో ఈ రెండు కులాలు ముందు ఉంటాయి.ప్రభుత్వ ఉద్యొగాల్లో పై స్థాయిల్లో ఉన్న చాలామంది ఈ రెండు కులాల అమ్మాయిల్ని భార్యలు గా కలిగి ఉన్నారు.కొద్ది గా పరిశీలిస్తే ఎవరైకైనా అర్ధం అవుతుంది. కాని వివక్షత అనేది ఇంకా పాటించుతూ ఏదో సాధించాలనుకోవడం హిపోక్రసీ కాక మరేమిటి.డబ్బు హోదా పదవి ఉంటే చాలు ..ఎవరికైనా కూతుళ్ళని ఇచ్చి చేసే కులాలు ఇంకా కుల తత్వాన్ని పాటించడం దారుణం,అంతే కాదు వివిధ పార్టీల్లో పదవులు పొందిన ఎస్.సి లేదా .ఎస్టి. ఇంకా బిసి ల్లో చూసినట్లయితే ఎక్కడో చుట్టరికం కనబడుతూనే ఉంటుంది.దీనికి ఉదాహరణ చెప్పాలంటే కోకొల్లలు.

17, నవంబర్ 2017, శుక్రవారం

"ప్రభాస్" కి నంది రాకపోవడం తో తెలుగు వారి పరువు జాతీయ స్థాయి లో పోయింది.ఇటీవల ప్రకటించిన నంది అవార్డ్ లు తెలుగు చిత్ర సీమ నే కాదు..సగటు తెలుగు వాడి కళాభిరుచిని అవమానించడమే అంటే అతిశయోక్తి కాదు.అసలు బాహుబలి జాతీయ స్థాయి లో అంత ఆదరణకి నోచుకోవడానికి ప్రధాన కారణం ప్రభాస్ యొక్క మంచి రూపం ఇంకా నటన కూడా..! కాని అతనికి తప్ప మిగతా పది పైగా శాఖలకి నందులు ఇవ్వడం ఘోరమైన జడ్జ్ మెంట్.దీనివల్ల అర్ధం అయింది ఏమిటంటే ఇండియా మొత్తం ని అలరించినా తెలుగు నేల లో ప్రశంస పొందడం కష్టం.కారణం ఇక్కడ గూడు కట్టుకున్న దుర్మార్గమైన కుల పైత్యం ఈ రేంజి లో మరే రాష్ట్రం లోనూ ఉండదు.

ఇక లెజండ్ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.చవక బారు మాస్ సినిమా ..దానికి ఏ మాత్రం తక్కువా కాదు ,ఎక్కువా కాదు.కాని ఆ హీరో అత్యుత్తమ నటన ఏ కోణం లో నుంచి చూశారో ఆ గొప్ప న్యాయ నిర్ణేతలు. ప్రతి భావాన్ని అదరగొట్టే తరహా లోనే తప్ప మరో విధంగా చెప్పలేని నటులు గొప్ప నటులు గా చలామణీ కావడం అదీ కులం మీద వంశం మీద రాజకీయం మీద కళ ల్ని హైజాక్ చేయడం ఇక్కడ చెల్ల వచ్చ్నేమో గాని దేశం లోని మిగతా ప్రాంతాల వారు నవ్వుకుంటుంటారు తెలుగుల వెర్రి కళా పోషణలకి.

1, నవంబర్ 2017, బుధవారం

రేవంత్ రెడ్డి కి అంత సీను ఉందా..?

రేవంత్ కాంగ్రెస్ లో చేరుతుండటం పెద్ద విషయం గా ప్రచారం చేయడం వింత గా ఉంది.ఇన్నాళ్ళు తెలెంగాణా లో దేశం కి పెద్ద దిక్కు గా ఉండడం వల్ల మీడియా ప్రచారం వచ్చింది.నోరు బెట్టుకొని అడ్డం గా అవాకులు చవాకులు వాగడం మినహా చేసిన గొప్ప పనులు ఏమున్నాయి.ఇకపోతే కాంగ్రెస్ లో బహుబలులు ఎక్కువ,ఎవరి కుంపటి వారిదే,ఎవరి పెద్దరికం వారిదే.ఇప్పటికీ టి ఆర్ ఎస్ కి  జనాల్లో బాగానే పట్టు ఉంది.కొన్ని పొరబాట్లు చేసినా దాని ఎత్తి చూపించగల ప్రభావ వంతమైన నాయకులు కాంగ్రెస్ లో లేరు.రేవంత్ కి ఏ మాత్రం పరపతి పెరిగినా అతని పోటీదారులు సహించరు.అతని వల్ల గొప్ప ప్రయోజనం కూడా ఉంటుందని అనుకోవడం కూడా అతి ఆశే కావచ్చును.

15, అక్టోబర్ 2017, ఆదివారం

మన వాళ్ళకి స్వతహా గా రాసే ఆ నైపుణ్యం లేదని అనిపించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లల పాఠ్య పుస్తకాల్ని కొన్ని అంటే సాఘిక శాస్త్రం కి సంబందించి 8,9,10 తరగతుల వారివి చదివాను.ఎంత కృతకంగా రాశారో అనిపించింది పైగా తెలుగు మీడియం లో పాఠానికి మక్కీకి మక్కీగా ఉండాలనే తపన ఒకటి కనబడింది.అసలు ఈ పుస్తకాలు చదివితే ఆ శైలి ఎలా ఉందంటే ఏదో వార్తల్ని రాశి గా పోసినట్లుంది తప్ప ఒక ఆంగ్ల జీవపు నడక కనబడలేదు.ఈ పుస్తకాలు చదివిన పిల్లలకి గాని మేస్టార్లకి గాని ఇంగ్లీష్ లోని స్వతహా గా ఉండే ఆ ఫ్లో దొరకదు.మీరు ఎన్ సి ఈ ఆర్ టి వారి పుస్తకాలు చూడండి..ఒకసారి చదవండి..అసలు ఇంగ్లీష్ లో పాఠం రాసే దాంట్లో ఏం మిస్స్ అయ్యామో తెలుస్తుంది.

నిజానికి  ఇవి చదివితే ఇంగ్లీష్ రాకపోగా కంఫ్యూజన్ కలుగుతుంది.ఆ ఎన్ ఇ ఆర్ టి వారి పుస్తకాల్నే రైట్స్ కొనుగోలు చేసి ఇక్కడి పాఠశాల ల్లో పెట్టండి.కొద్ది గా అయినా ఆంగ్ల మీడియం లో చదివిన ఫలితం కలుగుతుంది.మన వాళ్ళకి స్వతహా గా రాసే ఆ నైపుణ్యం లేదని అనిపించింది.ఇకనైనా ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని కాపాడండి.ప్రయోగాలనుంచి.  

11, అక్టోబర్ 2017, బుధవారం

అన్నిటి లో అమెరికా ని అనుసరించే మనం దీని లో ఎందుకు వెనుకాడటం..?ఇటీవల ఒక పేపర్లో చదివాను..హైదరాబాద్ నగరానికే చెందిన వ్యక్తి చేస్తున్న ఎడతెగని న్యాయ పోరాటం గురించి..!ఆయన వినతి ఏమిటంటే ప్రతి అప్లికేషన్ ఫాం లోను ...అంటే అది విద్యా సంస్థ కావచ్చు,ఉద్యోగం కోసం కావచ్చు ఇంకా ఏ సందర్భం లో గాని ఒక వ్యక్తికి ఇష్టం లేనప్పుడు తన కులాన్ని ఇంకా మతాన్ని తెలియబరచకుండా లేదా రాయకుండా ఉండే వీలు ఉండాలని..దీంట్లో ఎంత మాత్రం తప్పు లేదు.ఒక్కొకరి భావజాలం అది ఏదైనా దాని ప్రకారం ఇంకొకర్కి ఇబ్బంది కలిగించకుండా జీవించే హక్కు ఉండటం లో తప్పు ఏముంది.అమెరికా లో గాని ఇంకా జపాన్ లో గాని ఇంకా అనేక దేశాల్లో తను ఏ మతం లో నమ్మకం లేనివాడనని కనుక మతరహిత వ్యక్తి గా నమోదు చేయించుకోవచ్చు.అది ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ విషయమైనా సరే ఆ స్వేచ్చ ఉన్నది.మన దేశం లో సైతం కులం ఇంకా మతం తెలియబరచకూడదు అనుకున్నపుడు వ్యక్తి కి ఆ వెసులుబాటు కల్పించాలి.ఆ మేరకు అన్ని చట్టాలను సవరించాలి.

15, జులై 2017, శనివారం

ముఖ్యంగా డ్రగ్స్ వాడుతూ ఉండేవాళ్ళ కళ్ళు తెలిసిపోతూనే


డ్రగ్స్ ఉదంతం తెలుగు సినిమా ప్రపంచాన్ని కుదిపివేస్తోంది.కొన్ని వేల మంది పిల్లలు దీనికి అలవాటు పడినట్లు బయటకి వచ్చింది.ఆ న్యూస్ కంటే సినిమా వాళ్ళ డ్రగ్ వాడకం ప్రకంపనలు రేపుతోంది.అదే రంగుల లోకానికి ఉన్న ప్రత్యేకత.ఇప్పుడు బయటకి వచ్చిన సినిమా వాళ్ళ పేర్లు చాలా మటుకు ఊహించినవే. కొద్దిగా జనరల్ నాలెడ్జ్ ఉంటే ఆ వ్యక్తుల్ని గుర్తించవచ్చు.ముఖ్యంగా డ్రగ్స్ వాడుతూ ఉండేవాళ్ళ కళ్ళు తెలిసిపోతూనే ఉంటాయి. కంటిలో తెల్ల గుడ్డు అనేది మిగతా వాళ్ళతో పోలిస్తే పత్తి పువ్వు లాగా మితిమీరిన తెల్లగా కనిపిస్తుంది.దానివల్ల కళ్ళు చాలా బ్రైట్ గా ఆకర్షణీయం గా కొట్టొచ్చినట్లు కనబడతాయి.మొహం ఉబ్బినట్లు గా ఒక గ్లామర్ తో ఉంటుంది.అయితే కొన్ని ఏళ్ళు పాటు వాడ్తూ పోయే వాళ్ళకి నరాల మీద విపరీత ప్రభావం చూపిస్తాయి.


మనకి ఇపుడు బయట పడింది గాని ఆ బాలీవుడ్ లో ఈ ట్రెండ్ బాగా వేళ్ళూనుకుంది.ముఖ్యంగా ఉత్తరాది లో పంజాబ్ ఇంక కొన్ని రాష్ట్రాల్లో ఈ డ్రగ్ కల్చర్ మితి మీరి ఉంది.రైతులు తమ పొలాల్లొ పనిచేసే కూలీలకి ఇవి సరఫరా చేస్తుంటారు.శ్రమ తెలియకుండా పనిచెయడానికి.పెద్ద చేపలు ఎప్పుడూ ఏదోలా తప్పించుకుంటూనే ఉంటారు.ధోరణి చూస్తుంటే మన తెలుగు ఇండ్ర్రస్ట్రీ లో అదే జరుగుతున్నట్లు అనుమానం వస్తోంది. అయినా వేచి చూద్దాము ఏమి జరగనున్నదో..!   

27, మే 2017, శనివారం

"బాహుబలి-2" సినిమా పై నా రివ్యూ...!అందరూ బాగా ఉంది...అంటూ ఉంటే ఈ మధ్యే చూశాను.ముఖ్యంగా గ్రాఫిక్స్ సూపర్ అని మారుమోగుతుండటం తెలిసిందే గా..! కాని ప్రచారం జరిగినంత ఇది గా అయితే నాకు అనిపించలేదు.కధ వండిన తీరు లో గాని,గ్రాఫిక్కుల వరసలో గాని అనేక కాపీలు తోచి ఇదేమి కిచిడీ సినిమా రా బాబూ అనిపించింది.ఆ శివగామి సభ లో సిం హాసనం ఇరు వైపులా నిలబడినట్లుగా ఉండే పేద్ద గోల్డెన్ శిల్పాలు ..అదే కత్తి పట్టుకొని నిలబడ్డవి..అవి ఆస్కార్ అవార్డ్ లోగోలు కావా..?కాకపోతే ఇంతెత్తు ఉన్నట్లు చూపారు.రోమన్ల ఆర్చిటెక్చర్ లో ఉన్నట్లుగా భవన సముదాయాలు,ఇంకా రాజుల కత్తులు,రధాలు అన్నే వాటిల్లోనుంచి తీసుకున్నవే..ఇది ఇండియా రాజుల కధ నా..రోమన్లదా..?ఇక ఎక్కడ చూసినా పిచ్చ బంగారం లా విగ్రహాలు,తాపడాలు..కృతకంగా ఉన్నాయి.

 కోనన్  ద బార్బేరియన్ సినిమా లోనుంచి కొన్ని యుద్ధ సన్నివేశాలు లేపేశారు.కట్టప్ప బాహుబలిని నమ్మించి చంపడం కాన్సెప్ట్ ఒక సేక్స్పియర్ నాటకం లో నుంచి లేపేసినది.గ్రాఫిక్స్ అన్నీ చాలా కృత్రిమంగా ఉన్నాయి.చైనా గోడని కూడా గ్రాఫిక్స్ లో వాడేశారు.ఇక భవనాలు...యుద్ధ సన్నివేశాలు అనేక హాలివుడ్ సినిమాల్లో చూసిన వాటికి నకళ్ళే.ఇంత ధనం పెట్టి తీసినపుడు ఏదైనా చారిత్రక సినిమా తీసినా బాగుండును.దుస్తులు,భవనాలు,శిల్ప చాతుర్యాలు..ఇలాంటివి అన్నీ చూసి ..అసలు ఇది ఏ దేశపు సంస్కృతికి చెందిన సినిమా అనిపించక మానదు.

150 నుంచి 200 దాకా టికెట్లు పెంచి అన్ని కోట్లు వసూలు చేసింది అని చెప్పుకోడం అతి తెలివి.ఇదొక తొండి ఆట.ఈ రికార్డుల్లో పస లేదు.ఎవరు ఏమనుకున్నా నాకు అనిపించింది ఇదే. ఈ కాడికి హాలివుడ్ కూడా తీయలేని సినిమా అని గప్పాలు కొట్టుకోవడం హాస్యాస్పదం.అసలు సినిమా నిర్మాణం లో అంత ఖర్చు జరిగిందా అనేది కూడా ఒక సందేహమే.