Pages

2, ఆగస్టు 2013, శుక్రవారం

ఒకప్పటి రాజేంద్ర ప్రసాద్ స్థానాన్ని ప్రస్తుతం నరేష్ ఆక్రమించాడని చెప్పవచ్చు.



ఒకప్పటి రాజేంద్ర ప్రసాద్ స్థానాన్ని ప్రస్తుతం నరేష్ ఆక్రమించాడని చెప్పవచ్చు.

నటుడు నరేష్ నటించిన ఇంచుమించు ప్రతి సినిమాని చూస్తూ వస్తున్నాను.సినిమా యొక్క జయాపజయాలతో నిమిత్తం లేకుండా నరేష్ మనలని నవ్వించడం లో సక్సెస్ అవుతున్నాడు.డైలాగ్ చెప్పడంలో అతని టైమింగ్ ..హావభావాలు బావుంటాయి.అందరి వాడిని అనే టైప్ లో ముందుకెళ్ళడం కూడా అతనికి కలిసి వచ్చే అంశం.హీరోయిన్లను తరచూ మార్చడం కూడా ఓ వెరైటీ అని చెప్పాలి.

అయితే ఎప్పుడైతే తన నటన రోటీన్ అవుతోందని వీక్షకులు భావిస్తున్నారో గ్రహించి వెంటనే కొంత చేంజ్ చూపించాలి.అప్పుడు ఎక్కువ కాలం నిలదొక్కుకునే అవకాశం వుంటుంది. ఆ టెక్నిక్ ని గ్రహించడం వల్లనే బ్రహ్మానందం ఇన్ని ఏళ్ళు హాస్య చక్రవర్తిగా నిలదొక్కుకున్నాడు.

తాము ఏదిచేసినా చెల్లుతుందిలే అనుకునే రోజులు పోయాయి ఈ టివీ లు వచ్చిన తరవాత.ఎందుకంటే ఇప్పుడు వీక్షకునికి అనేక రకాలైన exposures వున్నాయి ప్రతి విషయంలోనూ...కె.విశ్వనాధ్ లాంటి లాంటి దర్శకుడు కూడా ఒకే మూసలో వెళ్ళడం వల్లనే చివరిలో తీసిన  చిత్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.
                                                            Click here for More       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి