Pages

23, ఆగస్టు 2013, శుక్రవారం

ఇంతకీ మంతెన సత్యనారాయణరాజు జీవించివున్నారా..మరణించారా..?




ఈ మద్య ఈ ప్రచారం బాగా జనాల్లోకొచ్చింది.అసలు జీవించి ఉన్నట్టయితే ఎందుకని జనాల్లోకి వచ్చి ఎప్పటిలాగా నేచురోపతి మీద సమావేశాలు పెట్టడం లేదు.మంతెన ఆరోగ్య విధానాలు కొన్ని బాగా క్లిక్ అయ్యాయి.పేదవారి  నుంచి కోటీశ్వరులదాకా చాలామంది అభిమానులు కూడా వున్నారాయనకి.

ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఏదో ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారని కొన్ని  వెబ్సైట్ లలో చూశాను.ఇంకొన్ని సైట్ లలో మంతెన చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు దాన్ని కొన్ని ప్రయోజనాలనిమిత్తం దాచిపెడుతున్నారని అంటున్నారు.

కొన్ని ఏళ్ళ క్రితమే కొన్ని ఫార్మా కంపెనీలు అతడిని డీఫేం చేయడానికి కుట్రపన్నాయని అయితే పలు మీడియా యజమానులు దానికి ప్రాచుర్యం కల్పించడానికి ఇష్టపడకపోవడం వల్ల సక్సెస్ కాలేదని ఒక జనాంతికం గా వున్న మాట.ఆయన విధానాలవల్ల చాలా అల్లోపతీ కి చెందిన మందులు వాడకం తగ్గిపోయిందని దానివల్ల కొన్ని కార్పోరేట్ శక్తుల కన్నుకుట్టిందని అంటారు..మరి అది ఎంతదాకా నిజమో..ఆ దేవుడికే తెలియాలి. Click Here For More

1 కామెంట్‌: