Pages

9, సెప్టెంబర్ 2013, సోమవారం

తుఫాన్ సినిమా పై నా రివ్యూ



సగటు తమిళ్ డబ్బింగ్ సినిమాలానే వుంది.కాకపోతే ఇది హిందీ లోనుంచి డబ్ అయింది. అసలు అలనాటి జంజీర్ ని మళ్ళీ రీమేక్ చేయాలని ఎందుకు అనిపించిందో  ..అదీ రాం చరణ్ హిందీ ఎంట్రీకి..!

ఆది నుంచి అంతం దాక పరమ బోరు గా వుంది.ఏదైనా చరిత్ర సృష్టించిన సినిమా ఒక్కసారే అలా కుదురుతుందంతే..!మళ్ళీ షోలే ని ధర్మేంద్ర,అమితాబ్ చేసినా అంత గ్రేట్ గా తీయలేరు..అదంతే..!

ఇక అమితాబ్ దున్నిపారేసిన జంజీర్ ని అంతకన్నా దున్నేదేముంది..!70-80 దశకాలలోని ట్రెండ్ వేరు. అమితాబ్ నిలువెత్తు రూపం...బ్రహ్మాండమైన కంచు కంఠం..భావోద్వేగాల్ని అనితరసాధ్యంగా పలికించే అతని నటన తో రాం చరణ్ నటనని ప్రేక్షకులు తప్పక కంపేర్ చేసుకుంటారు.అప్పుడు నిరాశ మిగలక ఏమవుతుంది..?

దర్శకుని ప్రతిభ గాని,మంచి ఫోటోగ్రఫీ గాని,చక్కని పాటలు గాని ఏమీ లేవనే చెప్పాలి.ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవడం కూడా అనవసరం..!Click here for more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి