Pages

6, ఏప్రిల్ 2014, ఆదివారం

బిజెపి అధిష్టానానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కి ఊపిరి ఊదాలన్న తాపత్రయం దేనికో...?



ఈ ప్రశ్న సగటు పౌరునికి ముఖ్యంగా తెలుగువారి ఇరు రాష్ట్రాల్లో తప్పక తొలిచేవేసేదంటే అతిశయోక్తి కాదు.తెలంగాణా లోని దాదాపు అన్ని జిల్లాల బిజెపి శ్రేణులు తీవృంగా వ్యతిరేకిస్తున్నా ,ఇంచుమించు అంతర్ధానమయ్యే స్థాయికి చేరుకున్న టిడిపి కి మళ్ళీ ఊపిరిలూదాలని,తమ జోడి ద్వారా ఆక్సిజన్ ఎక్కించాలని బిజెపి అధిష్టానం ఎందుకు నిర్ణయించుకున్నది.అది చాలా ఆశ్చర్యకరమైన విషయం.కొన్ని రాష్ట్రాలకి సరిపడా ఎన్నికల ఖర్చుని భరించడానికి గాని టిడిపి అంగీకారం గాని తెలిపిందా అనే సందేహం రాకమానదు.లేకపోతే అంత గత్యంతరం ఏమున్నది..?

ఈసారి గాని అధికారం లోకి రాకపోతే ఎప్పటికీ కష్టమే అనే రీతిలో తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.అందుకనే సాధ్యమైనన్ని అన్నిదారుల్లో ప్రయత్నాలు ముమ్మరంగా జరుపుతున్నారు.పవన్ కళ్యాన్ ని ఇండైరెక్ట్ గా రంగం లోకి దించింది కూడ అందుకేనన్న అనుమానం రాకమానదు.ఎందుకంటే దానివల్ల గణనీయంగా ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లు వై.ఎస్.ఆర్.సి.పి. గాని ఇటు కాంగ్రెస్ కి గాని పడకుండా చీల్చడం ఒక ఎత్తుగడ కావచ్చును.

తెలుగుదేశం పార్టికి శాపంగా పరిణమించింది దాని గత పాలనే.ముఖ్యంగా చివరి నాలుగు సంవత్సరాలు.కుల పాలన అంటే ఏమిటో,కులాహంకారం అంటే ఏమిటో రుచి చూపించారు.అనేక సంవత్సరాలు రెడ్లు సి.ఎం.పీఠం ఎక్కినా ఎందుకనో అంత అహంకారాన్ని చూసిఎరగము.ప్రతి కమ్మ కులస్థుడు తాను పాలకుని లా భావించుకొని ఇతర సమస్త కులాలవారిని వెంట్రుకముక్కలా చూసేవారు.బండ్ల పై వెనుకాల Born to Rule రాసుకోవడం పైగా..! ఆ చీకటి రోజులు కొందరి చరిత్ర లో స్వర్ణమయం కావచ్చును.కాని అనేక కులాలకి మరపు రాని కులపత్యాహంకార నీడలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి