Pages

1, జులై 2014, మంగళవారం

హస్త ప్రయోగం గురించి నా అభిప్రాయాలు (రెండవ భాగం)



నిన్న ఒక పోస్ట్ పెట్టా గదా..దానికి ఇది కొనసాగింపుగా రాస్తున్నా.మనశరీరం గురించి మనం పట్టించుకోపోతే ఎవరు పట్టించుకుంటారు.ప్రతిదాన్ని వేళాకోళం గా చూసి సిగ్గు పడి దాచుకోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.ముఖ్యంగా ఇలాంటి అంశాల్లో.కామసూత్రాల్ని ఎంతో చక్కగా పరిశోధించి కొన్ని వేల సంవత్సరాలక్రితమే ప్రపంచానికి ఇచ్చిన భూమి మనది.కాని మధ్యలో ఈ పరమ అజ్ఞానపు హ్రస్వ దృష్టి ఎలా వచ్చిందో.

ఇలాంటి విషయాల్లో జాన్సన్ ,కిన్సె లాంటి వాళ్ళు మహానుభావులు చేసిన పరిశోధనలు చదివా.చాలా గొప్పగా ఉన్నాయి.మనాళ్ళ లో ఉన్న జబ్బు ఏమిటంటే భారతీయ విజ్ఞానం మాత్రమే గొప్పదనుకునేవాళ్ళు బ్లంట్ గా Western knowledge ని తృణీకరిస్తారు.అది చాలా తప్పు.గొప్పదనం ఎక్కడున్నా మనం స్వీకరించాలి.

హస్త ప్రయోగానికి వస్తే... కొన్ని సార్లు నామీద నేను ప్రయోగాలు చేసుకున్నా.అలాగే నాకు తెలిసిన బాగా క్లోజ్ మిత్రుల అనుభవాలను క్రోడీకరించా..అంతేకాక వాళ్ళ రోజు వారి జీవితాన్ని కూడా పరిశీలించా.వాటన్నిటిని ఏ గ్రీక్ లేదా లాటిన్ భాషలోకో మార్చి పదాలని చెప్పలేనుగాని సింపుల్ గా చెపుతా..!

వెస్ట్ లో చేసిన ప్రయోగాలు హస్త ప్రయోగానికి సంబందించి నవి చూస్తే..ముఖ్యంగా మాంసాహారుల పై చేసినవి.అదీ బీఫ్ ప్రధానంగా తినేవారి పైన.అది తప్పని నేనడం లేదు.. ఎవరి అలవాట్లు వారివి..!అదీ చలి దేశాల్లో ఉన్నవారిపైన చేశారు.సాధారణం గా మీరు ఎన్నైనా చెప్పండి..బీఫ్ తినేవారి లో శక్తి ఎక్కువ గా ఉంటుంది.మన దగ్గర కూడా గమనించా.హింసని తట్టుకునే శక్తి గాని...శారీరక శ్రమ కి తట్టుకునే శక్తి గాని.. సెక్స్ కి సంబందించిన శక్తి గాని ఇవన్నీ బీఫ్ తినేవారిలొ ఎక్కువ అనిపించింది.మనం ఏది తింటే శరీరం అదే అవుతుంది.

 హస్త ప్రయోగం వాళ్ళు రోజు చేసుకున్నా తెల్లారి హాయిగా తిరగడం వీలవుతుంది.నవ్వకండి ఇవన్నీ నా పరిధి లో గమనించినవి.అదే ఇతరులు అంటే ఒక రాత్రి హస్త ప్రయోగం చేసుకున్నవాడు ..తెల్లారి ఏదో అవసరం పడినా ఒక రెండు మైళ్ళు నడవలేడు. సరికదా ప్రతి రోజూ అలా కంటిన్యూ చేస్థే మోకాళ్ళ లో సన్నగా నొప్పులు మొదలవుతాయి.ఒక నలభై నుంచి దాని ప్రభావం మరీ ఎక్కువ అవుతుంది.

నాకిప్పుడు నలభై ఎనిమిదేళ్ళు.గత పది ఏళ్ళ క్రితమే మా తాతాగారు చనిపోయారు.ఆయన 92 ఏళ్ళు జీవించారు.ఆయన కూడా హస్త ప్రయోగం ని నిరసించేవారు.ఆయన ఆయుర్వేదాన్ని తు.చ.తప్పకుండా నమ్మేవారు.అది అంత గొప్పదయితే మరి దాంట్లో ఆపరేషన్లు చేయడం ఎందుకు కనిపెట్టలేదు అని నేను వాదించేవాడిని.ఆయన తన 92 వ ఏట కూడా హాయిగా పనులు  చేసుకోవటమేకాదు..5 మైళ్ళు షికారుకి వెళ్ళివచ్చేవాడు సాయంత్రం పూట..!ఇప్పుడది తలుచుకుంటే అనిపిస్తుంది నిజంగా ఆయనే సూపర్ మేన్ అని.ఎందుకంటే మా స్నేహితుల్లో గాని ...నాలో గాని చూసుకుంటే ఇప్పటికే మోకాళ్ళ నొప్పులు వచ్చేశాయి.మన ఫార్మష్యూటికల్ కంపెనీలు కూడా అన్ని సైన్స్ పరిశోధనల్ని ఉన్నదున్నట్టు బయటికి రానివ్వవేమో...అదొక పెద్ద అంతర్జాతీయ రాకెట్. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి