Pages

27, జులై 2014, ఆదివారం

సానియా మీర్జా ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం ఎంతవరకు సమంజసం..?



ఇటీవల ఈ టాపిక్ మీద చాలా వేడిగా చర్చలు నడుస్తున్నాయి.రాయడం ఎందుకులే అనుకున్నా ..రాయక ఆగడం లేదు ప్రాణం.ముందుగా ఒక మాట చెప్పాలి.ఎవరికి కోపం వచ్చినా..!అదేమిటంటే మన హిందువులది బానిస మనస్తత్వం..! కోపం వస్తుందా ..అలాగే వచ్చేది నాక్కూడ మొదట్లో..!ఎక్కువ కులం గాని..తక్కువ కులం గాని....!తమ కంటే చిన్న కులం వాడిని అవమానిస్తూ..గేలి చేస్తూ..ఒక ఉటోపియా లో జీవిస్తుంటారు.కాని బయట దేశాల నుంచి ఏ దేశం వాడు రాని వాడికి నీరాజనాలు అర్పించి తన పక్క వాడిని వెన్నుపోటు పొడవడానికి వెనుకాడరు.ఆ విధంగానే కదా పోర్చుగీసు వాళ్ళ దగ్గర్నుంచి  .. బ్రిటిష్ వాళ్ళ దాకా ఇక్కడికి వచ్చి తిష్ట వేయగలిగింది.వంశాల చరిత్రలు చెప్పుకుంటూ జబ్బలు చరుచుకొనే కొన్ని అగ్ర వర్ణాలు సైతం తమ తోటి హిందువుల మీద ప్రతాపం చూపిస్తారు తప్ప బయటి వాడిమీద ఏమీ పీకలేకపోయారు.పై పెచ్చు వాళ్ళకి ఊడిగం చేస్తూ కొలువులని దక్కించుకొన్నారు.లేదా వారి మోచేతి నీళ్ళు తాగారు.చరిత్ర చదివితే అర్ధం అయ్యేది అదే.ఇప్పుడు దొరలు అనిచెప్పుకుంటున్న వారు అది ఏ కులం వారు గాని నిజాం మోచేతి నీళ్ళు తాగి వారి కాళ్ళ దగ్గర బ్రతికిన వారు కాదా..?శిస్తులు వసూలు చేసే పెద్ద జీతగాళ్ళు గా బతికినవాళ్ళేగదా..!

ఇటు కోస్తా కొస్తే ఇంకా దారుణం...ఏవో కొన్ని చెదురు మదురు సంఘటనలు తప్ప ఆధిపత్య వర్గాలుగా నేడు చెప్పుకునే వంశాల నుంచి బ్రిటిష్ వారికి ప్రతిఘటనగా నిలిచింది ఒక్కరు లేరు.వీరికి తెలిసింది ఒక్కటే..బండగా వాదించడం.అంతకంటే శక్తివంతులు కనిపిస్తే అన్నీ అర్పించి ఇంకొన్ని ఆస్తులు ..భూములు సంపాదించుకోవడం.ఆంధ్రా లోని జమీందారులు గా చెప్పుకొనే వారంతా ఎవరు..బ్రిటిష్ వారికి అడుగులకు మడుగులొత్తినవారే.ఎవరు గట్టి శత్రువు విదేశం నుంచి వస్తే వారికి తాబేదారులుగా బతకడమేగా చేసినది.

నిజాం గాని..బ్రిటిష్ వారు గాని ఎక్కడనుంచి వచ్చారు.ఇంతమందిమి హిందువులం ఉన్నామే మన మీద వారి ఆధిపత్యం ఏమిటి ..అని ఏనాడైనా హిందువులుగా ఆలోచించామా..ఎంతసేపు కులాలుగా విడిపోయి ఎదుడి వాడికి దొబ్బపెట్టడమే తప్ప.అప్పటినుంచి ఇప్పటిదాకా హిందువులది అదే మనస్తత్వం.కనుకనే ప్రతి వాడు ఆడుకుంటాడు.తప్పేముంది..తప్పేదేముంది..? 

ఒక ముస్లిం ఎంత చదువుకున్నా తన మత ప్రయోజనాల విషయం లో రాజీపడడు.ఎందుకని అలాంటి కట్టు ఆ మతం లోనే ఉంది.లేదా అతనికి దిక్కు ఉండదు ఏం జరిగినా..!పాలస్తీనా లో ఎక్కడో ముస్లిం లు చంపబడుతున్నారని ఇక్కడ వీళ్ళు తెగ భాదపడుతున్నారు..అసలు వాళ్ళకీ వీళ్ళకీ సంబంధం ఏమిటి..మతం ఒక్కటేగా..!మరి అదే హిందువులు ఎక్కడైనా చంపబడితే ..ఇంత ప్రతిఘటన ఎందుకు ఉండదు మన దేశం నుంచి.భయం అనేది ..ముఖ్యంగా తన మతం ని కాపాడుకొనే విషయం లో ఉండడమే హిందువు యొక్క వినాశన హేతువు.త్యాగం అనే మాట కి మన డిక్షనరీ లో పెద్దగా విలువ ఉండదు.ఒక వేళ ఉన్నా దాన్ని మాటల్లో వరకే చూపిస్తాం అంతవరకే.

ఇప్పుడు సానియా విషయానికి వద్దాం...అసలు ఆమె బాడి లాంగ్వేజ్ ని ఒక్కసారి చూడండి..ఆమె సరిగ్గ నలుగురిని అలరించే విధంగా మాట్లాడగలదా..శూన్యం.తెలంగాణా అనే కాదు..ఏ.పి.లో ఉన్నప్పుడైనా I am proud of India అని అంతర్జాతియ వేదికల మీద ..గెలిచినప్పుడైనా అన్నదా..?అంతే కాదు ..పైపెచ్చు జాతీయ జెండా మొఖం మీద కాళ్ళు బార్ల జాపి కూర్చున్నది.ఇదే విధంగా పాకిస్తాన్ జెండా ని ఆనించి పాక్ క్రీడాకారుణ్ణి కూర్చోమనండి.వాదోపవాదాలు ఉండవు.ఏ కండకి ఆ కండ కోస్తారు జనాలు.ప్రభుత్వమే అవసరం లేదు.ఆ తెగువ మనదగ్గర లేదు కాబట్టి ఎన్ని డ్రామాలు అయినా ఆడవచ్చు.ఇంత ఎందుకు...ఇంత మానవీయ సూక్తులు చెప్పే ఖ్రైస్తవ దేశాలు  ముస్లిం జాతుల పట్ల అవసరం వస్తే ఎంత రక్త పాతం గా స్పందిస్తాయో చూస్తున్నాము గదా..వాళ్ళు ఎంతైనా మేధావులు గదా..ఎవరికి ఏ భాష లో చెబితే అర్ధం అవుతుందో వారికి బాగా తెలుసు.వందల కోట్ల జనాభా ఉండగానే గొప్ప కాదు..దానిలో ఎంతమంది సారం గలిగిన వారు ఉన్నారనే దానిమీదనే ఒక జాతి గౌరవం నిలబడుతుంది.ఇజ్రాయెల్ జనాభా తిప్పి కొడితే కోటిమంది ఉండరు....కాని కర్కశత్వం లో సాటిలేని అరబ్ రాజ్యాల మధ్య లో ఉండి సిమ్హం లా పోరాడుతున్నారు.అది హీరోయిజం అంటే.ఇక్కడ నుంచి పాలస్తీనా ప్రజలకి సంఘీ భావం ప్రకటించే హిందూ సోదరులకి పాపం కాశ్మీరి పండిట్ల గురించి మాట్లాడటానికి ఎందుకో నోరుపెగలదు.అవును మరి ఓట్లు రాబట్టాలంటే పాలస్తీనా వారికి సంఘీభావం ప్రకటించాలితప్ప ఈ కాశ్మీరి పండిట్లకి ప్ర్రకటిస్తే ఏమి వచ్చిచస్తుంది.

ఈ బానిస భావం పోనంత కాలం సానియాలని ఊరేగించుకోవడం లో ఆశ్చర్యం ఏముంది...?        

1 కామెంట్‌:

  1. In this country, HINDU word was abolished by hindh people..... no doubt in.....hindhu dharma clean sweap by missionaries in south india up coming 15 or 20 years with support of sudo hindhus...

    రిప్లయితొలగించండి