Pages

2, ఆగస్టు 2014, శనివారం

అసలు ఇప్పుడు తీసుకునే సినిమాలు అన్నీ ఎవరు ఎవరి కోసం తీసుకునేవి..?



ఇప్పుడు ఎక్కువ పారితోషికం తీసుకునే బడా హీరోల సినిమాలని ఓసారి ఎలాంటి సైడ్స్ తీసుకోకుండా అవలోకించండి.వారి ముందు రాజకీయ జీవితాన్ని..ప్రస్తుత ఆర్దిక లాభాన్ని దృష్టిలో పెట్టుకొని తీసినట్టు ఉంటాయి.దానిలో ప్రేక్షకుల తప్పు కూడా కొంత ఉంది. ఎవరైనా ఇప్పటి సిని హీరోల ని విమర్శిస్తే వెంటనే కులపరమైన స్టాండ్ తీసుకుని ఎగబడుతుంటారు.ఏ కులం వారికైనా ఈ బడా హీరోలు చేసిన లేదా చేస్తున్న సాయం ఏమిటి..? ఆవేశాలు రెచ్చగొట్టి సమాజం లో మరింత కాలుష్యం పెంచడం తప్పా..?

ఉదాహరణకి అమితాబ్ అనే హింది హీరో కాయస్థ(మన దగ్గర నియోగి బ్రాహ్మణ లాంటి వారు)  అనబడే కులానికి చెందిన వాడు.కాని అక్కడ ప్రేక్షకులు ఎవరూ అతని కులాన్ని బట్టి సపోర్ట్ చేయరు ప్రతి అడ్డమైన దానికి.అలాగే తమిళ్ లో సూపర్ స్టార్ రజనీ స్వతహాగా మరాఠి .కాని తమిళులు అతనికి బ్రహ్మరథం పడతారు అతగాడి టాలెంట్కి.అతని తమిళ ఉచ్చారణ..డైలాగ్ డెలివరి మెచ్చుకొని తీరవలసిందే.కాని కులాన్ని ఆధారం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయమనే ధోరణి ఒక్క మన తెలుగు ఫీల్డ్ లోనే బాగా కనబడుతుంది. రాం చరణ్ గాని జూ.ఎన్.టి.ఆర్.గాని వేరే స్టేట్ వాళ్ళ కి బఫూన్ ల మాదిరిగా కనిపిస్తారు.మన కుల కళ్ళ లోనుంచి గొప్పగా కనిపించవచ్చును...అది వేరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి