Pages

3, అక్టోబర్ 2014, శుక్రవారం

మన చంద్రబాబు ఈ విషయం లో ఆద్యుడు.



స్వచ్చ భారత్ అనే పేరుతో నరేంద్ర మోడీ ఒక మంచి కార్యక్రమం ప్రారంభించాడు.అసలు అన్నీ కట్టిపెట్టి శుబ్రత గూర్చి చెప్పవలసిన అవసరం మన దేశం లో ఎంతైనా ఉంది.చదువుకున్నవాడు,చదువులేనివాడు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు రోడ్లని చెత్తమయం చేయడం లో ఎవరి పాత్రని వారు పోషిస్తున్నారు.డస్ట్ బిన్ లు ఉన్నా సరే దర్జాగా ఇష్టం వచ్చినట్టు చెత్త బయటపడేసే వాళ్ళు ప్రతిరోజు మనకి కనిపిస్తూనేఉంటారు.మరి ఇదే వీళ్ళు విదేశాలకి వెళితే మాత్రం ఒళ్ళు దగ్గరబెట్టుకొని శుబ్రతని పాటిస్తుంటారు. అంటే సరైనా శిక్షలు లేక ఇక్కడ జనాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.అది సంగతి.

ఒకానొక టైం లో చంద్రబాబు హయాం లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టడం వల్ల ఆఫీసులు,పార్కులు,పబ్లిక్ స్థలాలు కొంతలో కొంత శుబ్రంగా కనిపించేవి.మొక్కలతో పచ్చదనం కనువిందుగా ఉండేది.ప్రస్తుతం మోడీ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్నీ పార్టీ బేధాలు విడిచిపెట్టి అందరూ సక్సెస్ చేయాలి.ఒక మంచి విషయాన్ని ఏ గవర్నమెంట్ పెట్టినా ఆమోదించే స్థాయికి ప్రజాస్వామ్యం లో ప్రజలు ఎదగాలి తప్ప హ్రస్వ దృష్టి తో ప్రతిదాన్ని విమర్శించడం తగనిపని.విజయవంతమైన ప్రజాస్వామ్య దేశాలనుండి నేర్చుకోవాల్సింది అదే..!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి