Pages

22, నవంబర్ 2014, శనివారం

ఎన్ టి ఆర్ పేరు షంశాబాద్ దేశీయ టెర్మినల్ కి పెట్టమని ఏ ప్రజలు కోరారు..?



చేయవలసిన పనులు ఎన్నో పెట్టుకొని కేవలం ప్రజల్లో అలజడి వివాదాలు రేపే పనులు చేస్తూ ఉన్న అయిదు సంవత్సరాలు అలా దొల్లించుదామనె భవాన ఇరు రాష్ట్ర నేతలకి ఉన్నట్లున్నది. మాటలతో కోటలు కడుతూ కాలం గడపడం తప్ప రాష్ట్ర అభివృద్దికి దోహదం చేసే వ్యవహారం కనపడటం లేదు.దీనికి తోడు తాన తందాన అంటూ అస్మదీయ మీడియాలు భజనలు.కల్లబొల్లి వార్తలు.అటు తెలంగాణా లో ఉస్మానియా విద్యార్థులకు ఉద్యోగాల వరద పారిస్తానంటాడు ఒకాయన. ఇటు సింగపూర్ ని మరిపించే పాలన అంటూ ఇంకోకాయన.ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేరుస్తున్నారో ,ఆ దిశగా చర్యలేవో జనాలంతా గమనిస్తునే ఉన్నారు.ఇప్పుడు మళ్ళీ ఒక వివాదం..దీనిమీద అసెంబ్లీ సమయం కొన్ని రోజులు వృధా..ఎవరబ్బసొమ్మని ఇదంతా..!ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకుంటూ ,కుతంత్రాలు చేసుకుంటూ ప్రజల్ని ఇంకా ఎన్ని రోజులు మభ్యపెడతారు.

2 కామెంట్‌లు:

















  1. ;






















    ప్రజల సొమ్ముతో పాలకు సోకులు పడేది ప్రజలు చైతన్యవంతులు అయ్యేంతవరకు మాత్రమే.



    రిప్లయితొలగించండి

  2. పేర్లు పెట్టడం సులువు,కర్చులేని పని కదా.నా మట్టుకు రాజీవ్ గాంధి పేరు పెట్టినా,యన్.టి.ఆర్. పేరుపెట్టినా అభ్యంతరం లేదు.కాని ఇంతకు ముందు ఉన్న పేర్లు మార్చడం నచ్చదు.ఒకే విమానాశ్రయానికి రెండు పేర్లు పెట్టవచ్చా ? నిర్మాణాత్మకమైన,ప్రజోపకరమైన పనులు చెయ్యలేకే ఇలాటి జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు ఇద్దరు ముఖ్యమంత్రులూ.

    రిప్లయితొలగించండి