Pages

4, మార్చి 2015, బుధవారం

ఇలాంటి ఒక బ్లాగ్ ప్రతి ఊరు నుంచి ఒకటి ఉంటే అసలు ఎంత బాగుంటుందో..!


ఏ ఊరు గురించైనా ఆసక్తి ఉన్న వారు..ముఖ్యంగా ఆ ఊరివాళే రాస్తే చాలా బాగుంటుంది.అక్కడి చిన్న విషయాలు కూడా అలా రోజు రాసుకుంటూ పోతుంటే చదవడానికి చాలా బాగుంటుంది.ఎందుకంటే పత్రికల్లో వచ్చే మేటర్ కి ఒక హద్దు ఒక నిర్నీతమైన స్థలం తక్కువ గా ఉంటుంది.ఎంత చిన్న పల్లె అయినా,పట్టణమైన దేని విషయాలు దానికి ప్రత్యేకంగా ఉంటాయి.కనుక ఆసక్తిగా ఉంటుంది.వార్తని మించి ఇంకా చక్కగా వివరంగా రాయవచ్చు.తెలుగు తో బాటు ఇంగ్లీష్ వచ్చి దానిలో కూడా రాస్తే ఇంకా ఇతర ప్రాంతీయులకి చాల బావుంటుంది చదవడానికి.అవి రోజు వారి విషయాలు గాని.అప్పుడప్పుడు జరిగేవి గాని.ఆ మజానే వేరు.నిన్న నే తెలుగు లో గోదావరి అనే బ్లాగు చూసాను.మంచిగా అనిపించింది.అలాగే ఒరిస్సా రాష్ట్రం లోని ధెంకనాల్ అనే ఊరినుంచి రాసే ఈ బ్లాగు కూడా నేను చదువుతుంటాను.ఆ ఊరి సంగతులు అవీ బాగా కవర్ చేస్తుంటారు.ఇదిగో దాన్ని ఇక్కడ నొక్కి చూడుము.Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి