Pages

21, మార్చి 2015, శనివారం

జనాల్ని అడుక్కుని రాష్ట్ర రాజధాని కట్టేంత అవసరముందా..?


సినిమాలు చూసి చూసి ఉంటామేమో ..అదీ తెలుగు సినిమాలు కొన్ని సెంటిమెంట్ మాటలు బుర్ర లోకి భలే దూరిపోతాయి.కాకపోతే జనాల్ని డొనేషనల్ను అడగడమేమిటి రాష్ట్ర రాజధాని కట్టడానికి..? చత్తిస్ గఢ్,జార్ఖండ్ ,ఉత్తరాంచల్  ఈ కొత్త గా ఏర్పడిన రాష్ట్రాలేవీ ఉద్యోగుల్ని,జనాల్ని,పారిశ్రామికుల్ని రాజధాని కట్టడానికి అంటూ ఎక్కడా బెగ్గింగ్ చేసినట్లు తెలీదు.అసలు ఇలాంటి గొప్ప దేశోద్ధారక కార్యక్రమాలతో రాజధానిని నిర్మిస్తామని ఎలెక్షన్ లకి ముందు ఎందుకు చెప్పలేదు ఏలినవారు...?

ఒకేసారి ఎకాఎకిన ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలని కలలు గనడం బాగానే ఉంటుంది..కాని అంత అవసరం ఏమి ఉంది...లండన్ గాని,దుబాయ్ గాని,న్యూయార్క్ గాని,ఢిల్లీ గాని ఉన్నట్టుండి ఎకాఎకినా 5 లేదా 10 ఏళ్ళలో మహానగరాలు అయిపోలేదు.కొన్ని వందల ఏళ్ళు తీసుకున్నాయి..అసలు ఒక నేచురల్ గా ఎదిగే ఏ మహా నగరమైనా అలాగే ఎదుగుతుంది.ఏ చరిత్ర చూసినా తెలిసెది అదే.

విపరీతంగా ఎత్తైనా భవనాలు ఉండటం, ఎక్కడెక్కడి ఎమెన్సి కార్యాలయాలు  ఉండటం ,పార్కులు ఉండటం,ఇలాంటివి కాదు అక్కడి జనాల కొనుగోలు శక్తి పెరగడం ,స్వా అవలంబన సాధించడం,తలసరి ఆదాయం పెరగడం ఇవి అభివృద్దికి సూచికలు.బంగారం లాంటి భూముల్ని వేల ఎకరాల భూమిని ఏదో కతలు చెప్పి లాక్కుంటున్నారు,మరి అనుకున్న ఫలాలు రాకపోతే ఇప్పుడున్న ఏలికలు వారి ఆస్తుల్ని అమ్మి తిరిగి ఆ రైతులకివ్వగలరా..అసలు అలాంటి జవాబుదారీతనం ఎక్కడ ఉందని..! 

ఊరికే దానం చేయండంటూ జనాల మీదికి రాకపోతే వందల వేల ఎకరాలు కలిగిన పారిశ్రామికుల దగ్గరనుంచి కొన్ని భూముల్ని వశపరచుకోవచ్చుగదా.రాజధాని నిర్మాణానికంటూ.చిల్లర మల్లర గా వచ్చేవి ఏ మూలకి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి