Pages

29, మార్చి 2015, ఆదివారం

" రేయ్ " సినిమా రివ్యూ..!



అసలు మేగ్జిమం ఓ సినిమా ని అదీ ఓ తెలుగు సినిమా ని ఎంత అసంబద్ధంగా తీయవచ్చునో ఈ రేయ్ సినిమా ని చూసి నేర్చుకోవచ్చును.జమైకా లో ఉండే పోరంబోకు తెలుగు కుర్రోడు,లక్ష్యం తో రగిలే హీరోయిన్ కొన్ని సెంటిమెంట్ సీన్లు ఆ పిమ్మట పొగర్మోతు లేడి విలన్ తో సవాల్ మరియు ..ఎఫ్. బి.ఐ ని బురిడి గొట్టించుట అమెరికా లోకొచ్చి...సిఎనెన్ చానెల్ లో ఎప్పుడు బడితే అప్పుడు మాట్లాడుట..చెలరేగుట..అబ్బో ఇసుమంటి సిత్రాలు పిచ్చ పిచ్చగా తీశారు.డాన్ అని చెప్పుకునే జెన్నా (అది లేడీ పేరే మరి నమ్మాలి) ..ఆమె హీరో హీరోయిన్ ల గెలుపు ని అడ్డుగోడాకి వేసే వేషాలు సిత్తడి సిత్తడి గా ఉన్నాయి.నేను పుట్టి బుద్దెరిగాక చూసిన అతి సెత్త సినిమాల్లో ఇదోకటి.మరది నా అభిప్రాయం.దర్శకుడు,సంగీతం,పాటలు గట్రా గట్రా గురించి ఏమీ మాట్లాడను.చివరిలో మెంటల్ అసైలం లో తేలుతుంది లేడీ విలన్.దీన్ని రెండోసారి చూసిన వాళ్ళు అక్కడికే చేరుతారు నిస్సందేహంగా..! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి