Pages

2, మే 2015, శనివారం

"గంగ" (ముని-3) సినిమా రివ్యూ...!


ముని,కాంచన తరువాత మూడవ గొలుసుకట్టు సినిమా గా ఈ గంగ ని తీశాడు లారెన్స్ రాఘవ.మొత్తానికి హారర్ కామెడి లోని రుచి బాగానే కనిపెట్టాడు.ఓ వైపు ముతక హాస్యం మరో వైపు దెయ్యం భయం రెండిటిని మిళాయించి సక్సెస్ ని కొట్టేస్తున్నాడు.నిజం చెప్పాలంటే ఈ మూడు సినిమాల్లోను అంతర్లీనంగా ఒక కరుణపూరితమైన సెంటిమెంట్ ని కూడా జోడించడం జరిగింది.పిక్చర్ మీద సానుభూతి రావడానికి అది కూడా ఓ కారణం.ముని లో తండ్రీ కూతుళ్ళ ప్రేమానుబంధం అలాగే కాంచన లో శారీరక వైకల్యం తో భాదపడుతూ తల్లి దండ్రులతో కూడా బయటకి తోసివేబడిన మూడవ రకం మనిషి కధ ..ఇవన్నీ రసార్ద్రపూరితంగా కధలో  కలపబడి సినిమా మీద అసహ్యం కలగదు అదే హిట్ అవడానికి మరో కారణం.సరే భయానక భీబత్స హాస్య రసాలు సరే సరి.ఇక ఈ గంగ లేదా ముని-3 లో మాత్రం హాస్యం మరీ ముతకగా అనిపిస్తుంది.ముఖ్యంగా స్వలింగ సంపర్కులు అనేలా కొన్ని సీన్లు ఉండటం అవీ.ఇంకా తల్లి కొడుకులు కలిసి అదే రాఘవ లారెన్స్,కోవై సరళ లు కలిసి ఒక మంచం లో పడుకునేలా చూపడటం కూడా చికాకు సన్ని వేశాలే.

తాప్సీ హీరోయిన్ గా ఇంకా నటి గా తన ప్రతిభని ఎంతోకొంత చూపడానికి ఈ సినిమా సహకరించింది.సినిమా చివరకి వచ్చేసరికి పట్టు కోల్పోయినట్లు అనిపిస్తుంది.గ్రాఫిక్స్ ఎక్కువ అయిపోయి కలిగిన భయం కూడా హుష్ కాకి అని ఎగిరిపోతుంది.ఇది ఒకందుకు మంచిదేనేమో.నిత్య మీనన్ అంగ వికాలాంగురాలిగా మెప్పించింది. ఒక టి వి చానెల్ బృందానికి  కలిగిన దెయ్యపు అనుభవాలు,ఇంకొంచెం ఫ్లాష్ బాక్ దీనిమీద కధనం నడుస్తుంది.పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు.బి,సి సెంటర్లలో మంచి వసూళ్ళు చేస్తుందని చెప్పవచ్చు.వీలైతే ఓసారి చూడవచ్చు.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి