Pages

4, మే 2015, సోమవారం

"ఉత్తమ విలన్" సినిమా పై రివ్యూ..!



కమల్ హాసన్ చాలా గేప్ తర్వాత తీసిన సినిమా అని చెప్పి వెళ్ళాను.ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా నిరాశే మిగిలింది.అయితే డబ్బింగ్ సినిమాలు కొన్నిట్లో విషయమున్నవి...ఇతర భాషల్లో కి అనువాదం చేయడానికి లొంగవు.ఒకవేళ చేసినా సారం సరిగ్గా దిగక నిరాశ పుచ్చుతాయి.అంతమాత్రాన పరమ చెత్త అని చెప్పి ఒక మాటలో కూడా తీసివేయలేము.కమల్ పడ్డ కష్టం ,తపన వాటిని తీసివేయలేము.ఇంత వయసులో కూడా ఇంకా కొత్తగా ఏదో చేయాలని అనుకునే అతణ్ణి అభినందించకుండా ఉండలేము.తమిళం లో ఆయనే కధ,మాటలు వంటివన్నీ చేసినట్లు తెలిసింది.అసలు రమేష్ అరవింద్ దర్శకునిగా పేరే గాని ఆ ముద్ర అంతా కమల్ హాసన్ దేనని చెప్పవచ్చు.తన నిజ జీవితం లోని సంఘటనల్నే ,థెయ్యం ఆధారంగా సాగే మరో కధని పేరలల్ గా పెట్టి సినిమా తీశారా అని అనిపిస్తుంది.

ఓ వైపు ఒక పాత్ర  మృత్యువు కి చేరువ అవుతూంటుంది.మరో వైపు మృత్యువు కి దొరక్కుండా ఆడుకునే ఇంకో పాత్ర.ఒక కవిత లో ఉండే భావం మనకి గోచరిస్తుంది.అనువాదం లో కొన్ని డైలాగులు అర్ధం కాలేదు.అది ఒక మైనస్ అని చెప్పాలి.సంగీతం బావుంది.ఫోటోగ్రఫీ కూడా ఓ.కె.మూడు గంటలు సాగడం అనేది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి