Pages

29, మే 2015, శుక్రవారం

ఇంకా తెలంగాణా పై భ్రమలు పోనట్టు ఉంది

మొత్తానికి మహానాడు ముగిసింది.వచ్చే 2019 లో తెలంగాణా లో అధికారం తెదేపా దే నట.అవీ సదరు ప్రకటనలు..సగం ముక్కని పోగొట్టుకొని,సగం ముక్కకి కి సి.ఏం.అయిన బాబు గారి మాటలవి.అధికారం లోకి వస్తామనే గ్యారంటీ ఉందా..? అసలు అదే తక్కువ. ఇంకా తెలంగాణా పై భ్రమలు పోనట్టు ఉంది.అవి తగ్గించుకొని పూర్తి గా ఆంధ్ర వేపే ద్రుష్టి పెట్టడం మంచిది.అసలు ఈ సారి ఆంధ్ర లో అధికారం లోకి ప్రజలు తెచ్చింది కొన్ని ఈక్వేషన్ లవల్ల..అది తెలుసుకోవడం మంచిది.రాష్ట్రం చీల్చడం వల్ల జనాలు కాంగ్రెస్ ని ఈసారికి పక్కన పెట్టారు.అయితే జనాల కి మరో కొన్ని సంఘటనలు చాలు..మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవడానికి.అలా ఇతర రాష్ట్రాల్లో ఎన్ని సార్లు జరగలేదు.అదీ కాక జగన్ కాంగ్రెస్ తో పోలిస్తే గొప్ప ఓటింగ్ శాతం తో గెలవడం జరగలేదు.అది గుర్తుంచుకోవాలి.అదీ గాక కీలక సమయం లో కాపుల ఓట్లు పడటం పెద్ద ఫెచింగ్ అయింది.నిజానికి అవి జగన్ వేపు పడాల్సినవే. ఇవన్నీ ఇలాగే జరుగుతాయనే గేరంటీ ఏమీ లేదు.సమయం కలిసి వచ్చి అప్పుడలా జరిగింది.

కనక తెలంగాణా మీద ఆశలు వదుకుకొని పూర్తిగా ఆంధ్ర అభివృద్దికి  కృషి చేయడం మేలు.ఇక ఎన్ టి ఆర్ బొమ్మ చూపి ఆ సినిమా లు ,పాటలు చూపి ఈ నాటకీయ ,సినిమా సన్స్కృతి తో  మభ్యపెడితే జనాలు బోర్లపడే రోజులు పోయాయి.ఇంత కంటే రాజకీయ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళాడం వల్ల అందరికి మంచ్హిది.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి