Pages

5, జూన్ 2015, శుక్రవారం

"సింగం 123" సినిమా పై రివ్యూ..!



ఈ రోజే చూడ్డం జరిగింది.సంపూర్ణేష్ బాబు ఏ మాత్రం మళ్ళీ ఈ సారి చేశాడో చూద్దామని వెళ్ళాను.స్పూఫ్ ఆధారిత సినిమా నే.బాలకృష్ణ దగ్గర్నుంచి అల్లు అర్జున్ దాకా అందరి సినిమా ల్లోంచి అనుకరించి నవ్వించాలని ప్రయత్నించాడు.కధ సింపుల్ గా ఉంది.ఒక పవర్ ఫుల్ పోలిస్ అధికారి సింగం ..అతను లింగం అనే దుర్మార్గుని మట్టుపెట్టుట ..దాని లో భాగంగా సవాళ్ళు,పోరాటాలు ఇంకా ఎక్స్ ట్రా..లు.కానీ మొదటి సినిమా అంత అలరించ లేకపోయింది.కొన్ని చోట్ల డైలాగులు పేలాయి గాని కొన్ని చోట్ల చీప్ గా ఉండి పేలి పోతాయి.కొన్ని సార్లు సహనం కూడా పరీక్షించింది.

కధ లో ఒక దారీ తెన్ను లేదు.ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది.మరా దర్శకుడు ఎవరో గాని ఆ ఉత్తరాది కి చెందిన ఆ అతగాణ్ణి ఏమైనా చేయనిచ్చారా లేదా మంచు ఫేమిలీ యే ఇష్టం వచ్చినట్లు సినిమా తీశారా సంపూ కి ఉన్న మార్కెట్ ని ఎంకేష్ చేసుకోడాకి అనిపించింది.కొన్ని సీన్లు రోత టేస్ట్ ని బయటపెట్టాయి.చివరి సీను లో తెలంగాణా యాస మాట్లాడే హీరో తల్లి బీరు ఏద్దాం రమ్మని కొడుకు కోడల్ని పిలవడం ఎబ్బెట్టు గా ఉంది.


ఏదైనా సంపూ  కి ఉన్న గిరాకి దగ్గర పడేట్టు గానే ఉంది.కొన్ని చోట్ల హాస్యం డైలాగ్ చెప్పినా మనకి నవ్వు రాదు.హీరోయిన్ సనం అందాలు ఆరబోయడానికి పనికొచ్చింది.సంగీతం అంతంత మాత్రం.టోటల్ గా సినిమా ఊహించినంత ఎంటర్ టైన్ చేయడం లో సఫలం కాలేకపోయింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి