Pages

23, జూన్ 2015, మంగళవారం

"కేరింత" సినిమా పై రివ్యూ..!



అసలీ సినిమా కి కేరింత అని పేరు ఎందుకు పెట్టారో నాకైతే అర్ధం కాలేదు.ఎక్కడా ప్రేక్షకునికి కేరింత పెట్టాలనిపించదు.అదే దీని లోని ప్రత్యేకత.కాలేజీ ప్రేమల పై అల్లిన సినిమా ,సినిమా చూస్తున్నంత సేపు హేపీ డేస్ ఇంకా ఒకటి రెండు సినిమాలు గుర్తుకొస్తుంటాయి.కాని పేలవమైన కధనం ప్రతి సన్నివేశాణ్ణి మనం ముందు గానే ఊహించవచ్చు.నటీ నటుల్లో కొద్దిలో కొద్దిగా సుమంత్ అశ్విన్,శ్రీ దివ్య ఫరవాలేదు. మిగతావాళ్ళు ఒకమాదిరిగా ఓ.కె అనిపిస్తారు.నూకరాజు కేరక్టర్ ఏమో శ్రీకాకుళం యాసలో అరుస్తూ మాట్లాడితే అతని తండ్రి కేరక్టర్ మాత్రం ఇంకో యాస లో మాట్లాడుతుంది.అదేమి టో అర్ధం కాదు.ఆ మాత్రం Consistency  లేకపోతే ఎలా..?

పాటలు ఓ మాదిరిగా ఉన్నాయి.కెమెరా ఫరవాలేదు.సినిమా చివరకి వచ్చేసరికి ఏదో ఫీల్ కోల్పోయిన అనుభూతి కలుగుతుంది.సమయం ఉంటే ఓ సారి చూడవచ్చు.లేదా పెద్ద నష్టం లేదు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి