Pages

31, జులై 2015, శుక్రవారం

"బాహుబలి" సినిమా పై రివ్యూ



బాహుబలి సినిమా చూసిన తర్వాత ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది.అసలు ఏ పబ్లిసిటీ లేకుండా వస్తే ఒక మాదిరి సినిమా లా మిగిలిపోయేది.ఇప్పుడొచ్చే హాలివుడ్  సినిమాలు చూసేవారికి దీనిలో ఉన్న ఒరిజినాలిటి చూస్తే హాస్యాస్పదంగా ఉంటుంది.ఆహార్యం కూడా పాత్రలకి సంబందించీ... అన్నీ ఆంగ్ల సినిమాల్నే కాపీ కొట్టారు.ఈ సినిమా హాలీవుడ్ కి జవాబు అని వ్రాక్కుచ్చే వారిని చూస్తే వారి అమాయకత్వానికి నవ్వు వస్తుంది.ఇది ఒక అటు ఇటూ కాని అనుకరణ.250 కోట్లు బడ్జెట్ పెట్టి ఏ భారతీయ లేదా తెలుగు జాతి కి చెందిన మహానుభావుల గురించో సినిమా నిర్మిస్తే అది చరిత్ర లో మిగిలిపోయేది. ఆత్మ లేని ఏ నాగరికత దో తెలియని  ఒక సినిమా ని గ్రాఫిక్ మాయాజాలం ఇంకా భారీ సెట్టుంగుల పేరు తో బయటకి వదిలారు.

హాలివుడ్ సినిమాలు ఈరోజున కంప్యూటర్ ల పుణ్యమాని ప్రతి పల్లె లో చూస్తున్నారు.ఇంకా అవి కూడా డబ్బింగ్ అయి మన కి చాలా చేరువ గా వస్తున్నాయి కాబట్టి జనానికి ఏది చెబితే అది నమ్మే రోజులు పోయినయి అని గుర్తించాలి.వసూళ్ళ పరంగా 300 కాదు ఆరు వందల కోట్ల క్లబ్ లో చేరినా ఏముంది గొప్పతనం..?30 కోట్ల తో నిర్మించబడిన  భజరంగీ భాయ్ జాన్ 250 కోట్ల వసూళ్ళు దాటి నడవడమే గొప్ప విషయం ఇక్కడ.

కధ మొత్తం ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉంటుంది.సంగీతం అంత పేలవంగా ఉందేమిటో తెలియదు..ఒక్క పాట గుర్తుండదు.ప్రభాస్ పాత్ర అంత శివ లింగాన్ని ఎత్తుకొని బండల మీద,నీళ్ళలో చెంగు చెంగు న ఎగురుకుంటా వెళ్ళడం మన చెవుల్లో తామర పూవులు పెట్టడమే అనిపిస్తుంది. అతని పాత్ర కంటే రాణా పాత్రని బాగా ఎలివేట్ చేశారు.రమ్య కృష్ణన్ ఓవర్ యాక్షన్ చిరాకు పుట్టిస్తుంది.తమన్నా ని లేడీ వారియర్ గా తీర్చిదిద్దటం లో దర్శకుడు శ్రద్ధ చూపలేకపోయాడు.కట్టప్ప పాత్రని అంత దైన్యంగా హైన్యంగా చూపడం అసహ్యంగా అనిపిస్తుంది..మళ్ళీ అంతటి వీరుడిని...!?

చివరకి సీక్వెల్ చూడమంటూ ఓ కొసమెరుపు...!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి