Pages

23, ఆగస్టు 2015, ఆదివారం

తెలుగు చిత్ర సీమ లో చిరంజీవి స్థానం అద్వితీయం ఎప్పటికీ..



చిరంజీవి 60 వ పుట్టినరోజు జరుపుకున్న సంధర్భంగా ఈ పోస్ట్.తెలుగు చిత్ర సీమకి ఒక హీరో ఎంత అందంగా ఎంత ఉర్రూతలూపే విధంగా డాన్స్ చేయగలడో చెప్పింది చిరంజీవి.దానిలో రెండో మాటే లేదు.అసలు అతని శరీరం లోనే సంగీత యంత్రం ఉన్నదా అన్నంత రమ్యంగా డాన్స్ చేయడం చిరంజీవి కే సొంతం.ఒక చిన్న మూవ్ మెంట్ కావచ్చును..కాని అది ఆయన శరీరం లో పలికినంత అందంగా ఇంకొకరి లో పలకదు.నేను ఇప్పడికి చూస్తున్నా ..చిరంజీవి ని మించిన అందమైన డాన్సర్ ఈనాటికి తెలుగు తెర మీది కి రాలేదు గాక రాలేదు.ఒక సర్కస్ ఫీట్ల మాదిరిగా ఎటుబడితే అటు వంటిని వంచే వీరులు... హీరోలు రావచ్చు గాక..కాని రిధం కి తగిన విధంగా ఒక్క సెకను కూడా లేటు గాకుండా బాడీని ప్రేక్షకులు రంజిల్లే విధంగా చేయడం అతనికే చెల్లు.అసలు ఆ దేవుడే అతనికి అటువంటి ఒక మంచి ఆకృతిని అంటే భావాన్ని రసరమ్యంగా పలికించే రూపాన్ని ఇచ్చాడు అనిపిస్తుంది.చిరంజీవి కళ్ళ లోని ఆ శక్తి ఎంత మందికి ఉంది...ఏ భావాన్నైనా పలికించే ఆ కళ్ళు అతనికి దైవం ఇచ్చిన వరం.

తెలుగు తెరకి నా దృష్టిలో ఇద్దరే ఇద్దరు మహానటులు ఉన్నారు.ఒకరు ఎన్ టి ఆర్ మరొకరు చిరంజీవి అంతే.అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న వారు నభూతో నభవిష్యతి.చిరంజీవి పార్టీ పెట్టి ఎత్తివేశాడు అని విమర్శంచేవారికి ఒకటే చెబుతున్నా ఇపుడున్న పరిస్థితుల్లో సాక్షాత్తు ఎన్ టి ఆర్ పార్టీ పెట్టినా ఇంతకంటే దారుణంగా దెబ్బ తినేవాడు.ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడున్న సామాజిక వెబ్సైట్లు లేవు.వ్యతిరేక మీడియా లేదు.అప్పటికి కోటి మంది దాకా ఓట్లని చిరంజీవి పొందగలిగాడు   అంటే అది మామూలు విషయం కాదు.వ్యక్తిగతం గా నేను కాపుని కాదు గాదు కమ్మని గాదు కాని నాకు తోచిన అంశాల్ని రాశాను. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి