Pages

24, సెప్టెంబర్ 2015, గురువారం

..నేనూ ఈనాడు చందాదారుణ్ణే..ప్రశ్నించే హక్కు నాకు ఉంది..!

హద్దులు మీరిన ఉత్సాహం అంటే ఇదే..!

ఈ మధ్య ఈనాడు డైలీ లో జయపుర అనే ఊరి లో ఏదో జరిగిందనే న్యూస్ రావడం తో అసలు ఈ జయపుర అనేది ఎక్కడుంది అనేది గూగుల్ లో కెళ్ళి వెతకడం తో అది రాజస్థాన్ లోని జై పూర్ లో జరిగిందన్నది తేలింది.మరి జయపుర అనే పేరు ఎందుకు తగిలించారు అని ఆలోచిస్తే అది సదరు దినపత్రిక పైత్యంగా తోచింది.ఎందుకంటే రాజస్థాన్ రాష్ట్రం లోని పత్రికల వెబ్సైట్ లలో చూసినా వాళ్ళు జై పూర్ అనే రాసుకున్నారు.కాని మన వారి తెలుగు తిక్క లో ఇది జయపుర అయింది అన్న మాట.అసలు ఊళ్ళ పేర్లని ఇష్టం వచ్చినట్లు మార్చాటానికి రైట్ వీళ్ళకి ఎవరు ఇచ్చారు. .? అయిదు నక్షత్రాల  హోటల్ అని,ఇంకేదో అని జనాల్లో స్థిర పడిన సులభమైన ఆంగ్ల పదాల్ని తెలుగు చేయడం అవి పలకడం మరీ జటిలంగా ఉంది.ఒక్కోసారి కంఫ్యూజన్ గానూ ఉంది.మరి ఇంత తెలుగు భక్తి గల వీరు రామోజీ ఫిల్మ్ సిటీ ని రామో గారి చిత్ర నగరం అని ఎందుకు మార్చరో..అదీ తెలుగు లా అనిపించడం లేదా..లేదా రూల్స్ తమకి వర్తించవా..కేవలం గొర్రె ల్లాంటి ఈనాడు చదువరులకి మాత్రమే వర్తిస్తాయా


..నేనూ ఈనాడు చందాదారుణ్ణే..ప్రశ్నించే హక్కు నాకు ఉంది..!

1 కామెంట్‌: