Pages

11, అక్టోబర్ 2017, బుధవారం

అన్నిటి లో అమెరికా ని అనుసరించే మనం దీని లో ఎందుకు వెనుకాడటం..?



ఇటీవల ఒక పేపర్లో చదివాను..హైదరాబాద్ నగరానికే చెందిన వ్యక్తి చేస్తున్న ఎడతెగని న్యాయ పోరాటం గురించి..!ఆయన వినతి ఏమిటంటే ప్రతి అప్లికేషన్ ఫాం లోను ...అంటే అది విద్యా సంస్థ కావచ్చు,ఉద్యోగం కోసం కావచ్చు ఇంకా ఏ సందర్భం లో గాని ఒక వ్యక్తికి ఇష్టం లేనప్పుడు తన కులాన్ని ఇంకా మతాన్ని తెలియబరచకుండా లేదా రాయకుండా ఉండే వీలు ఉండాలని..దీంట్లో ఎంత మాత్రం తప్పు లేదు.ఒక్కొకరి భావజాలం అది ఏదైనా దాని ప్రకారం ఇంకొకర్కి ఇబ్బంది కలిగించకుండా జీవించే హక్కు ఉండటం లో తప్పు ఏముంది.అమెరికా లో గాని ఇంకా జపాన్ లో గాని ఇంకా అనేక దేశాల్లో తను ఏ మతం లో నమ్మకం లేనివాడనని కనుక మతరహిత వ్యక్తి గా నమోదు చేయించుకోవచ్చు.అది ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ విషయమైనా సరే ఆ స్వేచ్చ ఉన్నది.మన దేశం లో సైతం కులం ఇంకా మతం తెలియబరచకూడదు అనుకున్నపుడు వ్యక్తి కి ఆ వెసులుబాటు కల్పించాలి.ఆ మేరకు అన్ని చట్టాలను సవరించాలి.

1 కామెంట్‌: