Pages

18, జనవరి 2022, మంగళవారం

అమెరికా ని తిడుతూ మళ్ళీ అక్కడికే ఎందుకు పంపుతుంటారో..?

  ఎ.బి.కె.ప్రసాద్ గారి వ్యాసాలు కొన్నిసార్లు పత్రికల్లో ముఖ్యం గా సాక్షి డైలీ లో  చదువుతుంటాను. ఆయన రాసే వాటిలో విషయసేకరణ బాగానే చేసినట్లు కనబడుతుంది గానీ ఒకటి మాత్రం అర్ధం కాదు.అమెరికా ని,ఆ దేశపు పెట్టుబడి దారీ విధానాల్ని,అక్కడి సంస్కృతి ని బాగా తిడుతుంటారు.ఈసడిస్తుంటారు.సరే అంతదాకా బాగానే ఉంది,అది ఆయన ఇష్టం అనుకుందాం.మరి అటువంటి ఆయన అమెరికా కి ఆయన సంతానాన్ని ఎందుకు పంపించినట్టు..?


ఆమధ్య ఎప్పుడో పత్రికల్లో చదివాను,ఆయన మనవడి నే అనుకుంటా అమెరికా లో అక్కడి నల్లజాతీయులు కాల్చిచంపినట్టు చదివాను.వాళ్ళ అమ్మాయి కూడా అక్కడే ఉన్నారనుకుంటాను.అదలా ఉండగా అమెరికా ని విపరీతం గా తిట్టే మరి కొంతమంది ప్రముఖ రచయితల పిల్లలు కూడా అక్కడే ఉన్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది.గద్దర్ సంతానం గాని,అలాగే సిపీఅయ్ నారాయణ గారి సంతానం కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.వీళ్ళనే కాదు ఈ లిస్ట్ ఇంకా చాలా పెద్ద గా ఉంది.


అమెరికా మీద ద్వేషం పుట్టించడం లో ముందంజ లో ఉంటూ అనేకమందిని బయట వారిని ప్రభావితం చేస్తున్న వీరు తమ ఇళ్ళ లో వారిని ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నారు.వీరి రాతల్ని చదివినా ,విన్నా మనకి అమెరికా అంటే వళ్ళు మండి పోతుంది ఇంత దోపిడీ చేస్తోందా ఆ దేశం అని..?మరి ఆ ఇంట్లో వారికి అలా ఏమీ అనిపించదా లేదా ఆ కబుర్లు అన్నీ జనాలకే తప్పా మనకి వర్తించవు అని లోపాయికారి గా చెప్పుకుంటారా..?అదొక గొప్ప అనుమానం నాకు..!   

2 కామెంట్‌లు:

  1. మీరు వ్రాసిన వాళ్ళ వ్యాసాలు నేను చదవలేదు కానీ, అగ్ర వర్ణాల మధ్యతరగతి ప్రజలు కూడా ఇలాగే ఉంటారు. సోషల్ మీడియా లో అమెరికా కి వ్యతిరేకంగా వచ్చిన పోస్టులు ఆవేశంగా షేర్ చేస్తారు కానీ వాళ్ళ పిల్లలు అమెరికా నుండి పంపించే డాలర్ల తో ఆస్తులు కొనుగోలు చేస్తారు.

    రిప్లయితొలగించండి
  2. simple logic mastaaru, F2 telugu movie lo oka serial dialogue vundi - pillalani kanagalam kaani vaari tala ratalani kanagalama ani - this applies.

    రిప్లయితొలగించండి