Pages

4, డిసెంబర్ 2016, ఆదివారం

రాం గోపాల్ వర్మ చేయబొయేది పరమ తప్పు



ఏదైతే జనాల్లో సంచలనం రేపుతుందో దాన్ని తీసి పబ్బం గడుపుకుందాము అనుకొనే స్థితి వచ్చిందో అప్పుడే అతగాని క్షీణ దశ ప్రారంభం అయిందని అర్ధం.రాం గోపాల్ దశ ప్రస్తుతం అలానే ఉంది.లేకపోతే వంగ వీటి మీద సినిమా ఏమిటి..అతడు ఒక ఆదర్శ పురుషుడా..?ఇంకొకటా..?ఇన్నాళ్ళ బాటు కమ్మ లేదా కాపు కుల దర్శకులు ఆ సబ్జక్ట్ మీద సినిమా తీయ లేక ఊరుకోలేదు.చల్లారిన గాయాలను రేపడం ఇష్టం లేక ఇరు వర్గాలు మౌనం వహించాయి. ఆ విధంగా చాలా మంచి జరిగింది,శాంతి భద్రతలు నశించడం వల్ల సమాజం లోని మిగతా అన్ని వర్గాలు దెబ్బతింటాయి.రకరకాల విషయాల్లో..!!

కాని తాను మాత్రం స్పెషల్ అంటూ కెలుకుతున్న ఈ సినిమా వల్ల ఏ నష్టం సమాజం లో వాటిల్లినా దానికి బాద్యుని గా వర్మ ని చేయవలసి ఉంటుంది.ప్రజలు గావచ్చు ప్రభుత్వం గావచ్చు ఇలాంటి బాధ్యతా రాహిత్య సినిమాలని నిరసించవలసిన అవసరం ఉంది.

2, డిసెంబర్ 2016, శుక్రవారం

"బేతాళుడు" సినిమా పై రివ్యూ



ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందే బాగా అంచనాలు పెంచింది.కారణం బిచ్చ గాడు సినిమా తో మంచి పేరు సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని.అతను ఈ సారి ఏ రూపం లో రానున్నాడో అని ఉత్ఖంట రేపింది.ఈ బేతాళు డు ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పాలి.ఇంటర్ వెల్ దాకా మామూలు హారర్ సినిమా లా నడిచింది.ఆ తర్వాత కొన్ని ట్విస్ట్ ల తో అలరిస్తుంది.ఈ తరహా సినిమాలు బొత్తిగా రాకపోలేదు గాని స్క్రీన్ ప్లే లో ఉన్న కొత్తదనం చేత కధా గమనం బోరు కొట్టదు.నిజానికి విజయ్ లో అన్ని భావాలు సరిగా పలకవు.దాన్ని బాగా ఎరిగి ఎక్కువ డ్రమటైజ్ చేయకుండా సన్నివేశాల్ని దానికి అనుగుణంగా తీర్చి దిద్దారు.

హీరోయిన్ గా నటించిన అరుంధతి నాయర్ పరవాలేదు. కాసేపు గత జన్మకి ,కాసేపు మెడికల్ సైన్స్ కి ముడివేసి ఇతివృత్తాన్ని లాగించారు.సంగీతం ఓకే.కధ చెప్పిన విధానం బాగుంది.అదే సినిమా ని నిలబెట్టింది.వీలుంటే ఓ సారి చూడవచ్చు. 

4, నవంబర్ 2016, శుక్రవారం

"కాష్మోరా" సినిమా పై రివ్యూ


వాల్ పోష్టర్ లు ఇంకా ఇతర పబ్లిసిటి చూస్తే ఇదొక ఫక్తు హారర్ సినిమా అనుకుంటాము.కాని ఒక రకంగా కామెడి సినిమా అనుకోవచ్చు.ముందు హారర్ బిల్డప్ ఇచ్చినా ఆ తరువాత కామెడి గా మారుతుంది.సెకండ్ చూసి వచ్చినా హాయి గా ఏ పీడ కలలు లేకుండా నిదరపోవచ్చు.కొన్ని తెలుగు సినిమాల్లోని సీన్లు తీసుకొని కొద్ది గా మార్పు చేర్పులు చేసి ఇది తీశారు.అయితే కార్తి పాత్రల విషయం లో  ...ముఖ్యంగా డబల్ రోల్స్ లో మంచి వేరియేషన్ చూపించాడు.రాజ్ నాయక్ గా ప్రేక్షకులకి గుర్తుండి పోయే పాత్ర చేశాడు.తమిళ్ వెర్షన్ లో దెయ్యాల ప్యాలస్ ఆంధ్ర లో ఉంటుంది...తెలుగు వెర్షన్ లో తమిళ నాడ్ లో ఉన్నట్లు మార్చారు.చిత్రం లో కొన్ని లొసుగులు ఉన్నా ఒకసారి చూడవచ్చు.నయనతార డీగ్లామర్ అయినట్లు కనిపించింది.

18, అక్టోబర్ 2016, మంగళవారం

"ప్రేమమ్‌" సినిమా పై నా రివ్యూ



మొట్టమొదటి గా నాకు ఒక సందేహం "ప్రేమమ్‌" అనే మాట సరైనదేనా..? మళయాళం లో ఆ పేరు ఉందని  అట్లానే తెలుగు లో కూడాపెట్టేశారు.అది అటు ఉంచితే...మూడు దశల్లో మనిషి లో కలిగే భావ పరిణామాల్ని దీనిలో చిత్రించారు.బహుశా గతం లో వచ్చిన "ఆటోగ్రాఫ్" సినిమా కధ ఇన్స్పిరేషన్ అయిఉండవచ్చును.ఈ కధా సంవిధానం కేరళ వాతావరణం లో నప్పేదే.మన తెలుగు లో కొన్ని మార్పులు చేశారు.అక్కడ క్రిస్టియన్ వాతావరణం లో సాగుతుంది సినిమా అంతా...!యూట్యూబ్ లో చూస్తుంటే దానికింద చేసే కామెంట్లు అన్నీ తెలుగు రీమేక్ ని కించపరిచేవిగా ఉన్నాయి,మంచి ఫీల్ ఉన్న సినిమా ని పాడు చేశారని వాళ్ళ బాధ.పాపం వాళ్ళకేం తెలుసా..మన తెలుగు కధా దారిద్ర్యం ఇంకా ఇక్కడి పోకడలు.అనుపమా పరమేశ్వరన్,మడోన్నా సెబాస్టియన్ ని ఉంచి సాయి పల్లవి స్థానం లో శృతి హాసన్ ని తీసుకున్నారు ఇక్కడ.దాంతో ఓ మూస ఫిల్మ్ లుక్కే వచ్చింది.అప్పటికీ కొన్ని కొకేషన్ లు అక్కడివే తీసుకున్నారు.


నాగ చైతన్య నటించిన చిత్రాల్లో కొంత మెరుగైనది గా చెప్పవచ్చు.మళయాళీ హీరో ని అనుకరించాడు..అది కనబడుతూనే ఉంది.ఒక మాదిరి సినిమా ..అంతే తప్ప రికార్డ్ కలెక్షన్ లు వస్తాయంటే అది అనుమానమే.ఒకటీ అర పాటలు బాగున్నాయి.కెమెరా పనితనం ఫరవలేదు.

10, అక్టోబర్ 2016, సోమవారం

తెలంగాణా ప్రభుత్వం చేసిన ఈ పనిని ఆంధ్ర ప్రదేశ్ చేసే వీలుందా..?


ఎట్టకేలకు బతుకమ్మ పండుగ ని రాష్ట్ర ప్రభుత్వ అధికార వేడుక గా ప్రకటించి తెలంగాణా లో ప్రతి ప్రభుత్వ కార్యాలయం లో ఇంకా ఇతర కార్యాలయాల లో జరిగేటట్లు చేసింది.కుల,మత ,వర్గ భేదాలు లేకుండా ఈసారి తెలంగాణా నలుమూలలా ఈసారి ఇవి జరిగాయి.ఆంధ్ర ప్రభావం ఎక్కువ గా ఉండి ఈ పండుగని  పెద్ద గా పట్టించుకోని ప్రాంతాల్లో సైతం పరిస్థితి మారిపోయి తప్పనిసరిగా బతుకమ్మ పండుగని చేసుకోవలసి వచ్చింది.ఆ విధంగా తెలంగాణా కి ఆత్మ లాంటి ఈ వేడుకని కెసీఅర్ ప్రభుత్వం పునరుజ్జీవింపజేసినట్లయింది.తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన లోను ఈ వేడుక ప్రజల్ని కలిసిగట్టు భావాన్ని ప్రొది జేసింది అనడం లో అతిశయోక్తి లేదు.ఇదే విధంగా ఒక సాంస్కృతిక ఐక్యత ని ఉద్దీపింప జేసే వేడుక ఆంధ్ర ప్రాంతం లో లేదా..ఉన్నా పెద్ద గా పట్టించుకోపోవడమా..?కోస్తా లోని సినిమా కల్చర్ లో సకల ఇతర విషయాలు  నిర్లక్ష్యం చేయబడటమే దీని వెనుకనున్న కారణమా..?

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

"జనతా గ్యారేజ్" సినిమా పై రివ్యూ



పర్యావరణ పరి రక్షణ ఒక వైపు, మంచి పనులు చేసే రౌడి గ్యాంగ్ మరో వైపు.ఈ రెండిటికి ప్రతినిధులు అయిన జూ.ఎన్ టి ఆర్ ఇంకా మోహన్ లాల్ లు కలుసుకొని ఇంకా సమాజ ఉద్ధరణ కొరకై నడుము  బిగించుట స్థూలంగా కధ ఇది.మధ్య లో కొన్ని రాజకీయాలు,బెదిరింపులు,పాటలు,పోరాటాలు,అలా సాగిపోతుంది.మొత్తం మీద చెప్పాలంటే సినిమా ఒక మాదిరి గా ఉంది.మరీ సూపర్ అని చెప్పలేము,బయట అనుకుంటున్నంత కోట్ల కలెక్షన్లు నిజంగానే కురుస్తున్నాయా..మరీ అంత లేదేమో..అనిపిస్తుంది.మోహన్ లాల్ మళయాళం లో  చేసే సినిమాలు చాలా వరకు వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలు,మన లాగా పెడ బొబ్బలు అవీ తక్కువ.అవసరం ఎంతో ఉంటే తప్ప. హీరోయిన్ లు ఉన్నారంటే ఉన్నారు అంతే.వాళ్ళ కి ప్రాధాన్యత తక్కువ.పాటలు ఒకటీ అర బాగున్నాయి. ఖాళీ ఉంటే ఒకసారి చూడదగ్గ సినిమా. 

28, ఆగస్టు 2016, ఆదివారం

పవన్ కళ్యాణ్ స్పందన వెనుక కారణాలు ఇంకా ఇతర విషయాలు......!


ఎందుకని ఉన్నట్టుండి ఒక ఇన్సిడెంట్ జరగగానే పవన్ కళ్యాణ్ స్పందించినట్లు..ఒక మీటింగ్ పెట్టడం..దాని ద్వారా కొంత మందికి కొన్ని సందేశాలు ఇవ్వడం.మర్డర్ అనేది మామూలు విషయం కాదు, అదీ అభిమానుల మధ్య.అసలు భారత దేశం మొత్తం లో ఇట్లా సినిమా హీరో ల విషయం లో  హత్యలకి తెగబడటం ఎక్కడా వినలేదు.అంత అనాగరిక  దశ లో తెలుగు సమాజం ఉంది.దీని వెనుక కొన్ని రాజకీయ కారణాలు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఒక వేళ ఈ సంఘటన కి గాని పవన్ గాని స్పందించక పోతే మిగతా అభిమానుల్లో కూడా బెరుకు ఏర్పడుతుంది.భయపడి ఎవడూ ముందుకు వచ్చే సాహసం చేయడు.దాని కోసమే మానసిక స్థయిర్యం కల్పించేందుకే పవన్  మీటింగ్ పెట్టి అనేకమందిని పరోక్షంగా తిట్టడం జరిగింది.

తెలుగు ప్రజల దరిద్రం ఏమిటంటే టాప్ డైలీస్ అనబడే దినపత్రికలు.ఈ రోజున సొషల్ మీడియా నే ఈ పత్రికల కంటే మెరుగైన 
 పాత్ర పోషిస్తున్నయి. అసలు చంద్ర బాబు ఒకందుకు సిగ్గు పడాలి...ఒక ముక్క తెగిపొయి అందరకి అసహ్యంగా కనిపిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ కి ..ముఖ్య మంత్రి అయినందుకు,కాని అది అంతా మరిచి సాధ్య మైనంత భూ కబ్జా రాజధాని పేరు మీద చేయడానికి తెగించడం అంటే తన తైనాతీ మీడియా మీద ఉన్న నమ్మకమే.


ఈ భూమి ని  దాచుకో ..దోచుకో ..అనే ప్రొగ్రాం కే ..మంట పుట్టి తెలాంగాణా ప్రజలు బాబు అండ్ కో ని తరిమి కొట్టింది.కాని మళ్ళీ ఇదే పాలసీ ని  సీమాంధ్ర లోను బాబు అమలు చేస్తున్నాడు. అదేమిటో గాని కోర్ట్ లు కూడా బాబు పట్ల ఉదాసీనత వహించడం చూస్తుంటే ..ఈ మేనేజ్ మేంట్ కళ లో బాబు బాగా ఆరితెరినట్లే కనిపిస్తోంది.పవన్ ఇచ్చిన కేంద్రం మీద వత్తిడి కార్యక్రమం ఎంతవరకు సఫలం అవుతుందో కాలమే చెప్పాలి.ఉద్యమాలు చేయడం అనేది తెలాంగాణా కే పరిమితం..ఆంధ్ర లో అంతా లౌక్యం,బల్ల కిందినుంచి నడిపించడం ఇవే కదా కనిపించేది.