Pages

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

గద్దర్ పేరు మీద సినిమా అవార్డులా...ఓర్నీ

 

గద్దర్ పేరు ని సినిమా వాళ్ళ కి ఇచ్చే అవార్డ్ లకి పెడదామనే టాక్ ఒకటి బయటకి వచ్చింది. జన బాహుళ్యం లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. అసలు ఆ పేరు ని పెడదామనే ఊహ రావడమే విచిత్రం. ఆయన కొన్ని సినిమాల్లో పాటలు పాడాడు. కొన్ని సినిమాల్లో కనిపించాడు. కాని మౌలికంగా తెలుగు సినిమా కి చేసినది ఏముందని..? పెద్దగా ఏమీ లేదు. అంతకంటే సినిమా కి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

గద్దర్ ప్రధానంగా ప్రభుత్వ విధాన వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు. విప్లవ గీతాలతో ఉర్రూతలూగించి యువత ని అడవుల్లోకి వెళ్ళేలా చేశాడు.అనేకమంది చావులకి పరోక్షం గా కారణమయ్యాడు. తను వయసు లో ఉన్నప్పుడు అలా చేసి వయసు మళ్ళిన కాలం లో ఏ పార్టీలనైతే తిట్టాడో అదే పార్టీల్లో చేరాడు. ఇంకా ఆ తర్వాత జరిగినవి అన్నీ అందరకీ తెలిసినవే. భద్రం కొడుకో...అనే పాట గాని , మదనా సుందరి ..అనే పాటగాని...ఇంకా ఆయనకి పేరు తెచ్చిన చాలా పాటలు ఆయన రాసినవి కావు.

అంజయ్య ఇంకా మిగతా వాళ్ళు రాసినవి.కాని వాళ్ళు రాసినట్లు స్టేజ్ ల మీద ఎక్కడా చేప్పేవాడు కాదు. ఆ విధంగా చాలా పేరు తెచ్చిన పాటలు ఆయన సొంత రచనలే అనుకుంటారు చాలామంది. ఇక సొంత కుటుంబం లో పిల్లలు మాత్రం ఉద్యమం లోకి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలా చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. ఎంతో మంది చావులకి కారణమై,మళ్ళీ ఉద్యమం నుంచి బయటకి వచ్చి పాత పాపులారిటి తో కొత్త జీవితాన్ని గ్లామర్ ని సాధించుకునే వీళ్ళు , వీళ్ళ ప్రభావం వల్ల గర్భశోకం అనుభవించిన తల్లిదండ్రులకి ఏం సమాధానం చెబుతారు. 

కనక సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డ్ లకి గద్దర్ పేరు పెట్టడం నూటికి నూరు పాళ్ళు తలతిక్క పని. ఈ ఆలోచన ఎందుకు ఎవరకి వచ్చిందో మరి.సరైన వాళ్ళ పేర్లు దొరక్కపోతే ప్రభుత్వం పేరు మీద ఇవ్వండి. నష్టం ఏముంది.      

2 కామెంట్‌లు:

  1. నిజమే. సినీ అవార్డులకు గద్దర్ పేరు సరికాదు. గద్దర్ పేరిట ఒక విశిష్టమైన జానపద / సాంస్కృతిక/ సామాజిక రంగాలలో విశిష్ట వ్యక్తులకు అవార్డు ఇవ్వవచ్చు.

    రిప్లయితొలగించండి
  2. హిందీ సినిమా రంగంలో వెలిగిన నటుడు, తెలంగాణా వ్యక్తి పైడి జయరాజ్ గారి పేరు పెట్టుకోవచ్చుగా?

    రిప్లయితొలగించండి