ఈ రోజు పుష్కరాలు మొదటి రోజు.ఘనంగా వచ్చారు జనాలు పత్రికల్లో వచ్చిన ప్రచారం అయితే ఏమిటి ఇంకొకటి అయితే ఏమిటి..అంతదాకా ఆనందం.కాని రాజమండ్రి ఘాట్ లో రమారమి 25 మంది దాకా చనిపోవడం అత్యంత విచారకరం.ప్రభుత్వానిదే బాధ్యత అని కొందరు..అబ్బే ప్రభుత్వానిది ఎలా అవుతుంది ..భక్తులకి మాత్రం క్రమశిక్షణ ఉండక్ఖర్లా అని కొందరు.. హబ్బే అధికారులదే తప్పు అని ఇంకొందరు సైడ్ లు తీసుకోవడం షురూ చేశారు.కాని సత్యాన్ని మాత్రం అంత తొందరగా ఒప్పుకోవడం మనవల్ల కావడం లేదు. అందుకనే మన దగ్గర సమస్యలు కొన్ని ఎప్పటికీ అలానే ఉంటాయి.యధారాజా తధా ప్రజా..!
దీంట్లో అందరి పాత్ర ఉంది..అంటే పైన చెప్పిన ముగ్గురి పాత్ర అని నా అర్ధం.రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినది అనడం లో సందేహం లేదు.VVIP లు VIP లు అందరూ పొలోమని మొదటి రోజు ఘాట్ ల దగ్గరకి రావడం తో అధికార యంత్రాంగం అంతా వారి వేపే దృష్టి సారించింది.మన జనాల క్రమశిక్షణ ..ముఖ్యంగా ఇలాంటి వాటి దగ్గర ఘోరంగా ఉంటుంది.పిల్లలని గాని,వృద్దులని గాని,అంగవికాంగులని గాని ఇలా కరుణ చూపి ఒక పద్ధతి లో పొమ్మని చెప్పే నేర్పే నాధుడేడి..ఎవడు చెప్తే ఎవడు వింటాడు ఇక్కడ..ఎవడి దోపిడి వాడిదే ఎవడి పుణ్యపు పరుగు వాడిదే...
కాళ్ళకింద ఎంతమంది చస్తే మనకేమిటి..?ఇంతమంది జనం వస్తారు గనక ఎలా యంత్రాంగాన్ని ఉపయోగించాలి అనేది ప్రభుత్వం ప్రణాళిక వేసుకోవాలి.ప్రభుత్వం వద్ద వనరులు ఉంటాయి..అధికారం ఉంటుంది.కనుక చేయగలిగే అవకాశం వారికి ఉంటుంది.అసలు ప్రభుత్వం ఎందుకు ఉన్నది..ఒక పెద్దన్న పాత్రని పోషించి పౌర జీవనాన్ని వెసులుబాటు చేయడానికేగా..!కనుక నా పాత్ర లేదు అని తప్పుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనుకుంటే పొరపాటు.అలాగే పౌరులు..ఎంత చదువుకున్నా ఎన్ని దేశాలు తిరిగినా ఇలాంటి కొన్ని గుంపుల్లో కి వచ్చేసరికి ఆంతదాకా ఉన్న సంస్కారం హుష్ కాకి అవుతుంది.తోసుకు పోవడమే..ఎవరు ఎలా అయినా చావనీ మనకి అనవసరం.కొన్ని సివిక్ సెన్స్ కి సంబందించిన పాఠాలు బలవంతంగానైనా నేర్పవలసిందే.ముఖ్యంగా క్యూ అనే భావన గూర్చి..!అవసరమైతే సింగపూర్ లో లా పేము బెత్తం తో కొట్టైనా చెప్పాల్సిందే.లేకపోతే తలకెక్కే పరిస్థితి లేదు.ఏం కొంపలు మునిగాయి ..ఇంకా చాలా రోజులు ఉన్నాయి గదా పుష్కరపు రోజులు గోదావరిలో మునగడానికి..ఇప్పుడు ఆ పోయిన ప్రాణాల్ని పుష్కర స్నాలు చేసి ఆ పుణ్యం తో తిరిగి తేగలరా..?
ఇక అధికారులు ..వాళ్ళు ఏం చేస్తారు ,అధికార పార్టి నేత ల్ని కాదని వాళ్ళు చేసేదేమి ఉంది.ఎంతసేపు వారి సేవ లో తరిస్తేనే గదా వాళ్ళ సేఫ్టి...కాని అధికార పార్టి ని సమర్ధించే మీడియా మాత్రం గుండుగుత్తగా తప్పునంతా అధికారుల మీద,పోలీస్ ల మీద తోసివేస్తుంది.అది ఒక మంచి వెసులుబాటు.ఎందుకంటే వాళ్ళు నోరెత్తి పత్రికలకి ఎక్కరు గదా..!
రిప్లయితొలగించండిమీరన్నట్లు అందరిదీ తప్పే.కాని రాష్ట్రప్రభుత్వం,దాని అధికార యంత్రాంగానిది ఈ ఘోరానికి ముఖ్యమైన బాధ్యత.ఏమైనా స్నానానికని వచ్చి ఇంతమంది బలి ఐపోవడం చాలా బాధ కలిగిస్తున్నది.