Pages

11, నవంబర్ 2013, సోమవారం

సత్య-2 సినిమా పై నా రివ్యూ



తెలుగు వెర్షన్ సత్య-2 చూశాను.దీంట్లో హీరో శర్వానంద్ అయితే..హిందీ వెర్షన్ లో హీరో పునీత్ సింగ్.సరే మనం తెలుగు దాని గురించి చెప్పుకుందాము.అసలు పాత సత్య సినిమా అంత బాగా లేదు.దాంట్లో మనోజ్ బాజ్ పాయ్,చక్రవర్తి ..తీసిన విధానం ఒక విన్నూత్నత కనిపించింది.దాంట్లో లాగే హీరో ని ఓ నగరపు డాన్ చేసిపారేస్తాడు.మళ్ళీ అతని వివరాలు ఎవరికీ వెల్లడించడు.నేర కధని చాలా నిర్లక్ష్యంగా డీల్ చేశాడు వర్మ.మొదట్లో కొన్ని చిత్రాలు బాగానే తీశాడు..కాని ఆ పేరుని అడ్డం పెట్టుకొని అడ్డమైన సినిమాలు తీస్తున్నాడీయన.సరిగ్గా అలాంటి దాంట్లో ఇది ఒకటి.

నేరాల కంపెనీ పెట్టడం ..మళ్ళీ దాని పేరు తెలియకుండా నడపడం చూపించినంత ఈజీ కాదు.ఎందుకో కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు పాయింట్ ని.కొన్ని పాత సినిమాల్లోని ముక్కల్ని అతికించి తీసినట్టు గా ఉంది. హీరోయిన్ అంతంత మాత్రం గా ఉంది.సంగీతమూ అంతే..!

ఎంత గొప్ప సబ్జెక్ట్ అయినా ...వరసగా నేర చరిత్రలు దట్టించి తీసుకుపోతుంటే మొనాటనీ వస్తుంది.ప్రస్తుతం వర్మ తన ట్రెండ్ మార్చుకుంటే తప్పా చూడదగ్గ సినిమాలు రావు. అతను తన గొంతు తో చెప్పే వ్యాఖ్యానం కూడా ఎవరో తరుముకొస్తున్నట్టు చెప్పాడు.  Click here

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి