Pages

17, జూన్ 2013, సోమవారం

ఇది చాలక నటన అసలు పలకని చెక్క మొహాల్ని వారసత్వం పేరిట రుద్దటం పైగా

నా వయసు అరవై అయినా మనసు మాత్రం ఇరవై మాత్రమే అని మాట్లాడే వారు వాళ్ళు జీవితానుభవాల్లోనుంచి నేర్చుకున్నది ఇదేనా అనిపిస్తుంది.ఎవరికైనా 20 లో వుండి పోవడం అంటేనే ఇస్టం.అలాగని కుదురుతుందా..? అప్పట్లో ఆగకుండా ఒక పది మైళ్ళు పరిగెత్తగలవు.మరిప్పుడు అలా చేయగలవా..?లేదు..కనుకనే వయసుని అంగీకరించాలి..దానికి తగ్గ పనులే చేయాలి.

అంతమాత్రం చేత చిన్నతనం అనుకుంటే ఎలా..ముఖ్యంగా నటుల్లో..అదీ తెలుగు నటుల్లో ఈ అజ్ఞానం చాలా ఎక్కువ.మన గీత బాగుండి ఇప్పుడు టి.వి. లు అవీ వచ్చి ప్రపంచ పోకడలు ప్రతి ఒక్కడికి తెలిసి ఆగుతున్నారు గాని లేకపోతే ఇంకా ఇరవై ఏళ్ళ అమ్మాయిలతో గెంతుతూనే వుండేవారుఈ వయసు మళ్ళిన నటశిఖామణులు.

ఇది చాలక నటన అసలు పలకని చెక్క మొహాల్ని వారసత్వం పేరిట రుద్దటం పైగా.ఎంతమంది అర్హులైన వారు మూలకెళ్ళిపోతున్నారో వీరివల్ల..! పైగా థీఏటర్లని కబ్జా చేసి వేరే వారి సినిమాలని నొక్కి పెట్టడం ఒకటి..! 

1 కామెంట్‌:

  1. భర్తృహరి అన్నాడు -మొహం మీద ముడతలు పడ్డాయి,తలమీద వెంట్రుకలు వెండికొండలయ్యాయి,దేహం శిథిలగృహమయిపోయింది,అయినా నా ఎదలోనితపన మాత్రం యవ్వనోత్సాహంతోనే ఉంది!NTR అక్కినేని లాంటి మహానటులు వృద్ధ్ప్యంలో కూడా తమ వయసుకు తగ్గ పాత్రలు వేస్తే జనం ఆదరించారు!నేటి చాలామంది నటులు పుట్టుకతోనే వృద్ధులు తొందరగా stale అయిపోతున్నారు!ఆ మహానటుల స్థాయికి నేటి hero లు అందుకోవడం అసాధ్యం అనను కానీ చాలాకాష్టం!మీరన్నట్లు చెక్కముఖాలలో అభినయం పలకధు!కానీ ఎవడో ఒకడు మహానటుడు అనుకొనిచోటునుంచి ఉబికి వస్తాడు!ఆశావాదంతో వేచి ఉందాం !

    రిప్లయితొలగించండి