Pages

15, మే 2014, గురువారం

ఆంధ్రుల దగ్గరనుంచి తెలంగాణా వాళ్ళు,తెలంగాణా వాళ్ళ దగ్గరనుంచి ఆంధ్రులు నేర్చుకోవలసిందేమిటి..?



ఆ ప్రాంతం లోను,ఈ ప్రాంతం లోను బాగా తిరిగిన వాణ్ణి గనుక ఇది రాయాలనిపించింది.ఎలాగు విడి పోయిన రాష్ట్రం కలవడం జరగదు గాని వాస్తవాలను అంగీకరించి చక్కగా ఎవరి ప్రాంతం లో వారు అభివృద్ది చేసు కోవడానికి కృతనిశ్చయులవ్వాలి.రాజకీయ నాయకుల కల్లబొల్లి కబుర్లను నమ్మడం మాని ఎవరి పనిలో వాళ్ళుండడం మంచిది.ఒకళ్ళనొకళ్ళు కవ్వించుకునే మాటలు ఇక చాలు.ఇరు వర్గాలు కట్టి పెట్టాలి.

ఆంధ్రులు లేదా కోస్తాంధ్ర వారి నుంచి తెలంగాణా వారనే కాదు ఎవరైనా నేర్చుకోవలసిన సుగుణాలు కొన్ని ఉన్నాయి.కష్టించి పనిచేయడం,సంపాదించిన దాన్ని పొదుపుగా దాచుకోవడం,వాటిని మిగతా వ్యాపారాలకి లేదా స్వ అభివృద్దికి మళ్ళించడం.ఏ విషయానికైనా చురుకుగా స్పందించడం...ఇంకా పనిజరగడానికి  కొంత లౌక్యపు కబుర్లు...సాహిత్య పరమైన పఠనం,తెలుగు భాష పై అభిమానం  ఇలాంటివి కొన్ని చెప్పుకోవచ్చు.ప్రస్తుతం తెలంగాణా లో మాట్లాడే భాష నిజాం పాలన ప్రభావం వల్ల వచ్చిన ఒక యాసే తప్ప అది తెలంగాణా తెలుగు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటుండదు.ఆ లెక్కన బమ్మెర పోతన కూడా ఆ యాస లోనే భాగవతాన్ని రాసివుండాలిగదా..!   

అలాగే తెలంగాణా వారి నుంచి ఆంధ్రు లు నేర్చుకోవలసింది అరమరికలు లేని స్నేహగుణం...ఒక చిన్న మంచి మాటతో వాళ్ళు స్నేహితులవుతారు..దానికి గాను ఫలానా వాడి కులం ,మతం ఏమిటి అని వారు యోచించరు. దొరల,నిజాం ల పాలనలో అణచబడి ఉన్నప్పటికి తెలంగాణా వారిలో ఒక స్వతంత్రేచ్చ కూడా బలంగా ఉంటుంది.ఒక స్థాయి దాటి వేధిస్తే అవతల వాడి స్థాయి గాని,తరువాత జరిగే పరిణామాలకి గాని భయపడకుండ ఎదురుతిరుగుతారు.

ఇలా ఎవరి మంచి గుణాలు వారికున్నాయి.వాటిని అవసరమైనత వరకు exchange చేసుకుంటూ హాయిగా ఎవరింట్లో వారు ఉంటం మంచిది.  

4 కామెంట్‌లు: