ఈ సారి ఎన్నికల ఫలితాలు అంచనా వేయడం లో జాతీయ చానెళ్ళు గాని,మిగతా వర్గాలు గాని కొంత వరకు ఫెయిల్ అయ్యాయి.మోడి ప్రభంజనం స్పష్టంగా కనిపించింది.ఏ ఇతర పార్టి యొక్క అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడం ఈ మధ్య కాలం లో ఏ ఇతర పార్టికి రాలేదు.దీనివల్ల కేంద్రం స్వతంత్రంగా వ్యవహరించగలిగే అధికారం సమకూరుతుంది.
ఇక రాష్ట్రం లో కొస్తే ఓ వైపు జగన్,మరోవైపు గులాబీ అని సర్వేలు చెప్పాయి.లగడపాటి కొంత వాస్తవానికి దగ్గరలోని అంకెలు చెప్పాడు గాని పెప్పర్ స్ప్రే గ్లామర్ వల్ల అతన్ని సీరియస్ గా తీసుకోలేదు. రాష్ట్రాన్ని చీల్చినదనే కోపం కాంగ్రెస్ పై ఎంత తీవృంగా ఉందో దేశానికి తెలిసింది. దానివల్ల కాంగ్రెస్ మట్టి కరిచింది.
ఇక మోడి ప్రభంజనం కూడా తెలుగు దేశం విజయానికి దోహదం చేసింది.ముఖ్యంగా యూత్లో ఇది బాగా పనిచేసింది.పవన్ కళ్యాణ్ రంగం లోకి వెళ్ళి చెప్పడం వల్ల కూడా ఈసారి కాపుల ఓట్లు చీలకుండా దేశానికి పడ్డాయి.ఇవి గనక జగన్ పార్టి కి మళ్ళి ఉంటే పరిస్థితి టఫ్ గా ఉండేది. ఇక మీదట ఎలక్షన్ల ముందు ముస్లిం ఓటు బ్యాంక్ ను దువ్వినట్టు ,కాపు కులస్థులను దువ్వడం కూడా ఓ ఆచారంగా మారినా వింత లేదు.చంద్రబాబు ఎటువంటి భేషజాలకి పోకుండా అన్ని వర్గాలని కలుపుకు పోవడానికి చేసిన యత్నం మంచి ఫలితాలనిచ్చింది.
రాష్ట్రం కొత్తగా ఏర్పడిన ఈ తరుణం లో ఓ కొత్త రాజధానిని నిర్మించడం లో బాబు పై ప్రజలు విశ్వాసం ఉంచినట్లు చెప్పాలి.జగన్ కూడా 60 దాటిన సీట్లని సాధించడం కూడా సామాన్యమైన విషయం కాదు.ఎందుకంటే ఓ వైపు జైలు కెళ్ళి వచ్చి,అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటూ కూడా ఆ సీట్లు సాధించడం విచిత్రమే.జగన్ ఒంటెత్తు పోకడలు పోయి కొంతమంది తమ పార్టి నాయకులని చివరిలో కనిపించకుండా చేశాడు.జూపూడి లాంటివారిని కూడ విశ్వాసంలోకి తీసుకోలేదు.
ఇక తెలంగాణా లో టీఅరెస్ విజయం అందరూ ఊహించిందే.ఉద్యమ పార్టీ గా దానికున్న బేస్ దానిని నిలబెట్టింది.ఏమైనా ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంతృలకు ముందున్నది అగ్ని పరీక్షే.రాష్ట్రాలని జనాల ఆకాంక్షలకి అనుగుణంగా అభివృద్ది చేయకపోతే చరిత్రలో ఒక పేజీ ప్రత్యేకంగా వారికుండిపోతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి