ఇది రాయాలనిపించింది.రెండు రోజుల క్రితం చదివాను.సిరాశ్రీ రాసిన మరియు సేకరించిన ఇంటర్యూలు అన్నీ కలిపి ఈ పుస్తకం తయారైంది.ఒక ప్రవక్త స్థాయి లో రాం ని ఫోకస్ చేయాలనుకున్నా ఎందుకనో తేలిపోయింది.మొత్తం మీద ఒక డ్రంకార్డ్ గా కొన్ని హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ గా రీడర్ కి అవగాహన ఏర్పడుతుంది. రాము మేనమామ ఒకతను మాత్రం బాగా ఉన్నదున్నట్లు చెప్పాడు.బటర్ బ్యాచ్ ని పక్కన పెట్టుకొని నానా చెత్త సినిమాలు సినిమాలు తీస్తున్నాడని ఆ వ్యవహారాలు కట్టిపెడితే మళ్ళీ మంచి సినిమాలు తీయగలడని చెప్పాడు.అది మాత్రం కరెక్టే.ప్రతి ఒక్కళ్ళ మీద ఫైర్ బ్రాండ్ కామెంట్లు చేసే వర్మ ఆ విషయాల్లో సెలెక్టివ్ గా ఉంటాడని సిరాశ్రీ యే ఒక చోట చెప్పాడు.ఎవరైతే సాఫ్ట్ టార్గెట్ లుగా ఉంటారో వాళ్ళ మీద మాత్రమే ట్వీట్ తుంటాడు తప్పా ఏ బాలకృష్ణ నో, ఇంకా ఏ చంద్ర బాబు నో ఎందుకని కామెంట్ చేయలేడు అని మనకీ ఈ పుస్తకం చదివిన తర్వాత అనుమానం వస్తుంది.అతను మొదటి నుంచి ఇదే తరహా వ్యక్తి అయితే అసలు ఈ మాత్రం అయినా పైకి వచ్చేవాడు కానే కాదు.చాలా తెలివి గా తన ఫైల్యూర్స్ ని కప్పి పెట్టుకుంటూ అక్కడక్కడ కొన్ని కొటేషన్ లని చెప్పుకుంటూ బండి లాగిస్తున్నాడు.సరైన హిట్ సినిమా తీసి అసలు చాలా ఏళ్ళయింది.నీషే,అయాన్ రాండ్ అంటూ చెప్పే కబుర్లు ఏ ఇంగ్లీష్ పుస్తకాల్ని పెద్దగా చదవని వాళ్ళకి అద్భుతం అనిపించవచ్చునేమో కాని ఆయా దేశాల్లో వాళ్ళ ఫిలాసఫీలు చాలా అవుట్ డేటెడ్ ..ఆ పిమ్మట ఎన్నో ట్రెండ్స్ వచ్చాయి...ఏది లేని చోట వెంపలి చెట్టే మహా వృక్షం మరి.
Pages
19, మే 2016, గురువారం
వోడ్కా విత్ వర్మ పుస్తకం ని చదివిన తర్వాత....

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి