Pages

25, ఏప్రిల్ 2016, సోమవారం

నిజమైన ప్రతిభా విశేషం ఈరోజు కాకపోతె వందల ఏళ్ళకైనా బయటబడితీరుతుంది

నిజమైన ప్రతిభా విశేషం ఈరోజు కాకపోతె వందల ఏళ్ళకైనా బయటబడితీరుతుంది...ఆ ఉదంతమే ఇది . స్వర్ణ కమలం సినిమా ..అదే ..విశ్వనాధ్ గారు తీసింది చూసే ఉంటారు.దాంట్లో ఒక పాట..కొలువై ఉన్నాడే దేవదేవుడు..అనే పాట ఒకటున్నది.భాను ప్రియ కూడా అద్భుతమైన నాట్యం చేస్తుంది దానికి.ఆ సినిమా లో ఆ పాట విన్నాక అబ్బా సీతారామ శాస్త్రి భలె రాసేడే అని ఆనందమనిపించింది.నిజానికి సీతారామ శాస్త్రి నా దృష్టి లో పెద్ద హృదయాన్ని ఊపేయగల కవి ఏమీ కాదు.భాష ని,భావాన్ని,ఇతర చమక్కుల్ని కొత్త అంచులకి తీసుకెళ్ళగలిగిన సత్తా అతని లో శూన్యం.అతని పాట ఏదీ లోపలకి వెళ్ళి తగలదు...ట్యూన్ కి తగిన పదాల్ని అలా పేర్చినట్లు ఉంటాయి పదాలు.ఒక వేళ పల్లవి లో లైన్లు బాగున్నా చరణాలు అర్ధం పర్ధం లేకుండా పేర్చినట్లు ఉంటాయి. ఈ విష్యం లో నా ఆల్ టైం ఫేవరైట్ వేటూరి గారే.ఆ చమక్కు..అది క్లాస్ పాటైనా ..బూతు పాటైనా..ఆ యిదే వేరు. ఆ ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నా...ఆ స్వర్ణ కమలం లోని ఆ పాట " కొలువై ఉన్నాడే " అనేది 17 వ శతాబ్దం లో తంజావుర్ ని పాలించిన మరాఠా పాలకుడు షహజీ మహరాజ్ రాసిన శంకర పల్లకి సేవ అనే ప్రబంధము లోనిదని తెలిసింది.దానిలోని పదాల పోహళింపు ..ఆ గమ్మత్తే వేరు..ఈ సారి మళ్ళీ విని చూడండి.ఆ మహానుభావుడి కైతకి ఇన్ని నాళ్ళకి ఇలా పేరు రావలసి ఉందేమో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి