పేపర్ల లో వచ్చిన ఫోటొలు,డైలాగులు ముఖ్యంగా సినీ నటుడు బాలకృస్ణవి చూసినపుడు అసలు ఏ విలువలు కేసి వీళ్ళంతా దేశాన్ని తీసుకుపోతున్నారు అని అనుమానం రాక మానదు.మనం జీవిస్తున్నది ప్రజాస్వామ్య దేశం లో.ప్రజా జీవితం తో ముడిపడి ఉన్న ప్రతి దాన్ని ఇక్కడ ప్రశ్నించే హక్కు పౌరులకి ఉంది.ఆ నటుడు ఒక్క సినీ నటుడిగా ఉంటే ఫర్వాలేదు,ఒక శాసన సబ్యుడు కూడా.అలాంటప్పుడు ఎంత బాద్యత గా వ్యవహరించాలి.కాని దానికి విరుద్ధం గా ఉంది విషయం. మొన్నటికి మొన్న ఆడవాళ్ళని కించపరిచేలా కామెంట్లు,ఆ పైన రోమియో మాదిరి గా క్రికెట్ గ్రౌండ్ లో చొక్కా విప్పి ధూమపానం చేస్తూ పోజుకొట్టడం,ఈ మధ్యనే కె.సి.ఆర్. కి సినిమా ఇన్విటేషన్ ఇస్తూ నెత్తి మీద కి కళ్ళ జోడు పెట్టుకొని పోజు ఇవ్వడం..ఇవన్నీ ఆయన అజ్ఞాన ,అహంకార ధోరణులకి నిదర్శనం. వీళ్ళ చుట్టూ ఉండే కోటరి కూడా అలాంటిదే.ఎంత మర్యాద గా ,సభ్యత గా ప్రవర్తిస్తే తాము అంత చులకన అయిపోతానేమొనని వీరి సగం మెదడు లోని ఆలోచన.అభిమానులు కూడా
ఇవి చూసి అదే గొప్ప లా ఫీలవ్వడం.అది ఇంకా దుర్దృష్టకరం.తమ పార్టి అధికారం లోకి వచ్చింది అంటే తమ కులానికి అధికారం జనాలు ఇచ్చారనే భ్రమలో మన నేతలు ఉండడం విచారకరం.దాన్ని తైనాతీ పత్రికలు,వర్గాలు పోషించడం ఇంకా ఘోరం.ఆ మధ్య పద్మ అవార్డ్ ల నామినేషన్ లు ఒకే వర్గం వారివి సెంటర్ కి పంపించడం కూడా కరుడు గట్టిన కుల అహంకారానికి నిదర్శనం. అంటే మిగతా ప్రజల ఓట్లు లేకుండానే వీరు గద్దెనెక్కారా..?
తెలంగాణా ని ఇచ్చిందనే ఎమోషన్ లో కాంగ్రెస్ ని కోస్తా లో తుడిచి పెట్టడం కూడా అర్ధ రహితం.ఆ పార్టీ గాకపోతే బి.జె.పి.అయినా ఇచ్చేదే.చంద్ర బాబు నుంచి వెంకయ్య దాకా తెలంగాణా ని దొడ్డిదోవలో సమర్దించినవారే,ఆ మేరకు అక్కడ రాసిచ్చిన వారేగదా.దాదాపు మూడేళ్ళకి దగ్గర్లో పడుతున్నది,కేంద్రం ఆంధ్ర పట్ల సవతి తల్లి ధోరణి నే ప్రదర్శిస్తున్నది.నరేంద్ర మోడి కి ప్రతిదీ తెలుసు..తనని గతం లో ఎలా తూలనాడింది..గుజరాత్ ఘర్షణల్లో అవలంబించిన వైఖరి..అదంతా..!మళ్ళీ ఇప్పుడు అవసరార్ధం ఏదో మెచ్చుకోలు కబుర్లు చెబితే కరిగిపోయే వ్యక్తి కాదాయన.పెద్ద పెద్ద అంతస్తులున్న ఫోటోల్ని చూపిస్తూ..ఇదిగిదిగో ఇలా ఉంటుంది మన రాబోయే రాజధాని అంటూ ఊరించటమే తప్ప జరుగుతున్నదేమీ లేదు.
హ హ హ, సినిమా వాళ్ళు నల్లకళ్ళజోడు పిచ్చాళ్ళండీ శశితేజ్ గారూ. నల్లకళ్ళజోడు పెట్టుకుంటే తమ అందం రెట్టింపు అవుతుందనీ, తమ "స్టైల్" పెరిగి మరింత గొప్పగా కనిపిస్తామనీ గట్టిగా నమ్ముతారల్లే ఉంది. అందుకే సమయం సందర్భం లేకుండా ఆ నల్లకళ్ళజోడు మొహానికి తగిలించుకుని పబ్లిక్‌లోకి వస్తుంటారు. కొందరు వేదిక మీద కూర్చున్నా తీయరు, ఇన్‌డోర్స్‌లోనూ తీయరు, పెద్దల సమక్షంలోనూ తీయరు (మహా అయితే నెత్తిమీదకి జరుపుకుంటారేమో. అది కూడా ఓ "స్టైల్" అనుకుంటారేమో). దానికి తోడు కొంతమంది చొక్కావి పైరెండో మూడో గుండీలు విప్పేసి కూడా దర్శనమిస్తుంటారు. తెర మీద వేషాల్లో ఒలకబోసే సంస్కారం బయట కూడా ప్రదర్శిస్తారనే గేరంటీ ఎల్లవేళలా ఉండదుగా.
రిప్లయితొలగించండిసినిమావాళ్ళే ఆరాధ్యదైవాలు, వాళ్ళని అనుకరిస్తేనే జన్మ ధన్యం అనుకునే ధోరణి పెరుగుతోంది కదా ప్రజల్లో. మొన్నోరోజు ఓ సభలో కేసీఆర్ ప్రసంగిస్తుంటే మొహానికి పెద్ద నల్లకళ్ళజోడు తగిలించుకుని సీఎం వెనకాలే వేదిక మీద నిలబడున్నాడో సెక్యూరిటీ మనిషి !