Pages

18, అక్టోబర్ 2016, మంగళవారం

"ప్రేమమ్‌" సినిమా పై నా రివ్యూ



మొట్టమొదటి గా నాకు ఒక సందేహం "ప్రేమమ్‌" అనే మాట సరైనదేనా..? మళయాళం లో ఆ పేరు ఉందని  అట్లానే తెలుగు లో కూడాపెట్టేశారు.అది అటు ఉంచితే...మూడు దశల్లో మనిషి లో కలిగే భావ పరిణామాల్ని దీనిలో చిత్రించారు.బహుశా గతం లో వచ్చిన "ఆటోగ్రాఫ్" సినిమా కధ ఇన్స్పిరేషన్ అయిఉండవచ్చును.ఈ కధా సంవిధానం కేరళ వాతావరణం లో నప్పేదే.మన తెలుగు లో కొన్ని మార్పులు చేశారు.అక్కడ క్రిస్టియన్ వాతావరణం లో సాగుతుంది సినిమా అంతా...!యూట్యూబ్ లో చూస్తుంటే దానికింద చేసే కామెంట్లు అన్నీ తెలుగు రీమేక్ ని కించపరిచేవిగా ఉన్నాయి,మంచి ఫీల్ ఉన్న సినిమా ని పాడు చేశారని వాళ్ళ బాధ.పాపం వాళ్ళకేం తెలుసా..మన తెలుగు కధా దారిద్ర్యం ఇంకా ఇక్కడి పోకడలు.అనుపమా పరమేశ్వరన్,మడోన్నా సెబాస్టియన్ ని ఉంచి సాయి పల్లవి స్థానం లో శృతి హాసన్ ని తీసుకున్నారు ఇక్కడ.దాంతో ఓ మూస ఫిల్మ్ లుక్కే వచ్చింది.అప్పటికీ కొన్ని కొకేషన్ లు అక్కడివే తీసుకున్నారు.


నాగ చైతన్య నటించిన చిత్రాల్లో కొంత మెరుగైనది గా చెప్పవచ్చు.మళయాళీ హీరో ని అనుకరించాడు..అది కనబడుతూనే ఉంది.ఒక మాదిరి సినిమా ..అంతే తప్ప రికార్డ్ కలెక్షన్ లు వస్తాయంటే అది అనుమానమే.ఒకటీ అర పాటలు బాగున్నాయి.కెమెరా పనితనం ఫరవలేదు.

2 కామెంట్‌లు:

  1. ఈ నాగచైతన్య కూడా మనకి ఒక హీరో వేషం వేసే నటుడు. వారసత్వపు నటుల వద్ద నటనను ఆశించటం మన తప్పే. ఏదో చేస్తే చచ్చినట్లు సంతోషించటమే. మన తెలునేలపై సినిమాల్లో ఒకడు నటుడైతే ఇంక ఆయన తాలూకు తరతరాలుగా అందరూ మహామహామహామహా నటులే అని మనం విశ్వసించి తీరాలి.

    ఏదో ఒక భాషలో ఒక పేరు ఉంటే దాన్ని అలాగే తెలుగులో వాడుకచేయటం‌ సబబు కాదు. చివరకు ఏదో తెలుగులో అసభ్యమైన అర్థం వచ్చే మాటకూడా, ఏదో భాషలో మంచి అర్థంలో ఉంది కదా అని చెప్పి సరాసరి వాడుకచేసే తమాషానూ చూడవలసి రావచ్చును.

    తెలుగుసినిమా బాగుపడాలంటే రెండే మార్గాలు వారసత్వపు హీరోల శకం అంతరించటం ఒకటి, దమ్మున్న కొత్త దర్శకులు నిర్మొగమాటంగా సత్తా ఉన్న నటులతోనే సినిమాలు నిర్మించటం ఒకటి. మరొకటి ఉంది - ఈ వారసత్త్వం సరుకు ధాటికనండి మరొకటనండి తెలుగు సినిమా అంతరించటం‌ ఒకటి. ఏం‌జరుగుతుందో చివరకు మరి.

    ఫరవాలేదు స్థాయి సినిమాలను త్రిప్పికొట్టక తప్పదు. తెలుగుసినిమా స్థాయి పెరగాలంటే ఈ‌ ఫరవాలేదు నటసాంకేతికాది వర్గం తప్పుకోక తప్పదు. లేదా ప్రేక్షకవర్గం వారిని తప్పించక తప్పదు.

    రిప్లయితొలగించండి
  2. శ్రీశ్రీ ఒకచోట "ద్వేషం ఇచ్చే పర్సెంటేజి ప్రేమం ఎట్లా ఇవ్వగలదు నేస్తం!" అని వాడాడు.పదాన్ని వాడటంలో తప్పు లేదు.కాకపోతే ఆ పదానికి అన్యాయం చేస్తూ చెత్తగా తియ్యడం వల్ల పదానికి ఉన్న ప్రత్యేకత ఏమీ పోదు.నాకైతే మాట బాగానే ఉంది.

    రిప్లయితొలగించండి