Pages

3, మే 2023, బుధవారం

"పొన్నియన్ సెల్వన్ - 2 "లో రోమాలు నిక్కబొడిచే సాంగ్

 పొన్నియన్ సెల్వన్-2 లోని "వీర రాజ వీర" అనే పాట నిన్న యూట్యూబ్ లో విన్నాను.అది తమిళ వెర్షన్. రోమాలు నిక్కబొడిచినాయి. ఏ.ఆర్.రెహమాన్ కంపోజిషన్ అద్భుతం.శాస్త్రీయ సంగీతం బేస్ చేసుకొని నూతన తరానికి కూడా నచ్చేలా చేశాడు. దాంట్లోని సాహిత్యం సైతం అతి మనోహరం.చోళుల వైభవాన్ని,వీరత్వాన్ని,రాజ్య విస్తరణని తమిళ కవి గొప్పగా రాశాడు.ఇటు వచ్చి తెలుగు లో విన్నాను.కొన్నిసార్లు మంచి పాటలు డబ్బింగ్ లో ఖూని అవుతుంటాయి. చంద్రబోస్ కూడా నిజం గా తమిళ వెర్షన్ కి ఏ మాత్రం తగ్గకుండా రాశాడు.అలాగే రీ రికార్డింగ్ కూడా చాలా క్వాలిటి తో ఉంది.ఈ మధ్య కాలం లో వచ్చిన ఓ అరుదైన సాంగ్ అని చెప్పవచ్చు.

పొన్నియన్ సెల్వన్ పోస్టర్ ల మీద చూస్తే మీకు ఆ టైటిల్ కింద Based on Kalki's novel అని కనిపిస్తుంది.ఒక గొప్ప నవల ని ,తమ చరిత్ర ని వివరించే నవలని తమిళులు గర్వంగా సినిమా తీసి ప్రపంచం మీదికి వదిలారు.ఎంత ధనం వచ్చింది వేరే మాట కాని చోళుల వైభవాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు,మరి ఆ విధంగా ఏ తెలుగు నవల ని అయినా మన వాళ్ళు ఇంతవరకూ చూపించగలిగారా..?ఇంగ్లీష్,హిందీ,ఇంకా ఇతర అనేక భాషల సినిమాల నుంచి రకరకాల మంచి సీన్లని లేపేసి కిచిడీ చిత్రాలు తీయడం తప్పా.మన తెలుగు లోనూ ఎన్నో గొప్ప చారిత్రక నవలలు ఉన్నాయి,కాకపోతే వాటి మీద దృష్టి పెట్టే తీరిక మనకి లేదు.

అలాంటి అభిరుచి ని కూడా మన సినిమా పెద్దలు ఎక్కడ ప్రొత్సహించారని..?తమిళం లోనూ పక్కా మాస్ సినిమాలు వస్తాయి.అలాగే మంచి ఆలోచనాత్మకమైన సినిమాలూ వస్తాయి.అలా తీయగలిగే వాతావరణాన్ని అక్కడ సమాజం కలిగించగా,మన సినిమా ఫీల్డ్ మాత్రం అత్తెసరు కుల మాఫియా బారిన బడి మేం తీసిందే సినిమా అన్నట్లు చేస్తున్నారు.అయితే ఈ ఓటిటి యుగం లో ఆ ఆటలు ఇకచెల్లవు.కాబట్టే సగటు తెలుగువాడు ఓటిటి లో ప్రతి మంచి సినిమా ని , ఏ భాష అయినా సరే చూస్తున్నాడు.   

4 కామెంట్‌లు:

  1. మనదో సిగ్గులేని జాతి. రాష్ట్రాన్ని కర్కశంగా చీలుస్తుంటే పట్టని జాతి, విభజన హామీల్లో ఇవ్వాల్సిన వాటిలో కనీసం 10 శాతం ఇవ్వకపోయినా చీమ కొట్టినంత కూడా బాధ లేని వాళ్ళం, ఏమీ ఇవ్వకపోయినా అన్నీ ఇచ్చాం అనే కేంద్రాన్ని, బలగాన్ని, ఆదరించి జేజేలు కొట్టే అలగా జనం మనం. తన రాష్ట్రం లోని ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లు రెండూ నత్త నడక నడుస్తున్నా, ఆ రెంటినొదిలేసి, ఆంధ్ర పై పడి, సుమారు వందేళ్ల చరిత్రున్న ఆంధ్ర బ్యాంకు ని చిదిమేసి యూనియన్ కి తగిలిస్తే, సీతారామన్ మా ఆంధ్రా కోడలు అని మురిసిపోయి, తిలకం దిద్ది, చీరె, సారె పెట్టి చంకలు గుద్దుకునే జాతి. ఆఫ్టర్ అల్ జల్లికట్టు అనే ఓ ఆట నాపితేనే కేంద్రం కళ్ళకి ఉల్లిగడ్డని రుద్ది, పిల్లి మొగ్గేయించిన శూరులతో మనకేంటి పోలిక సార్. అంతెందుకు, తెల్లారి లేసిన కాణ్ణించి 90 శాతం తెలంగాణ వార్తలతోనే మనను వాయగొడుతున్నా, తెలుగు సినిమా భాష మొత్తాన్ని తెలంగాణీకరించినా, గుడ్లప్పగించి చూస్తూ, చెవులప్పగించి వింటూ పాప్కార్న్ నవులుకుంటున్న "చూడు పిన్నమ్మ" జాతి మనది. మనకెందుకు సారూ అలాంటి పట్టింపులూ, నిట్టూర్పులు?

    అంతెందుకు, ఒక రాష్ట్రం లోని అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ, కూడబలుక్కోకుండానే, కేంద్రం లోని ఒకే ఒక పార్టీ కి తొత్తులై స్వప్రయోజనాలు తప్ప, రాష్ట్ర హితం పట్టించుకోని వానపాము నాయకులున్న రాష్ట్రం మనది కాక మరోటుందా, చెప్పండి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బండి వారే !!!! మీలో ఈ కోణం కూడా వుందాండి ! అద్భుతః ఎప్పుడూ ఇలాంటి కామెంటు చూడలె మీ "కాడి నుండి" :)



      జిలేబి

      తొలగించండి
  2. బండి వారు,
    బాగా అన్నారు సిగ్గులేని మన జనాల గురించి. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రా బ్యాంకుని తెర మీద నుంచి చెరిపేసిన విషాదం గురించి కూడా మీరు చెప్పినది అక్షరసత్యం.

    తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ ఆనాడు NTR గారేదో నినదించారు గానీ ఇప్పటి జనాలకేమీ పెద్దగా పట్టినట్లు లేదు (ముఖ్యంగా కార్పొరెట్ట కల్చర్ బాగా విస్తరించిన తరువాత).

    అసలు అక్కినేని నాగేశ్వర రావు గారిననాలి. ఆయన మద్రాసు నుండి మకాం ఎత్తేసిన వాడు హైదరాబాదుకు బదులు ఏ విజయవాడలోనో గుంటూరులోనో - మొత్తానికి కోస్తా ఆంధ్రాలో - సెటిల్ అయితే బాగుండేది. క్రమక్రమంగా తెలుగు చిత్ర రంగం కూడా ఆ ఊరికే తరలి ఉండేది (మద్రాసు నుండి). ఆయనేమో మన రాష్ట్రం మన రాజధాని అనుకున్నాడేమో తెలియదు గానీ (హైదరాబాదు చేరుకున్న ఆంధ్రులలో 90% లాగా) వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డాడు. ఆ రంగం వాళ్ళు హైదరాబాదులో స్టూడియోలు కట్టి, థియేటర్లు కట్టి, సినిమా నిర్మాణం చేపట్టి విపరీతంగా ఆ రంగాన్ని హైదరాబాదులో కేంద్రీకృతం చేసారు. తాము కూడా స్వంతంగా ఇళ్ళు, పొలాలు, ఇతర ఆస్తులు గణనీయంగా కూడబెట్టుకున్నారు. ఇప్పుడు విభజన తరువాత సినిమా పరిశ్రమను ఆంధ్రాకు తరలండి అంటే వాళ్ళెందుకు వెడతారు? పైపెచ్చు హైదరాబాదులో ఉంటున్నారు కాబట్టి తమ ప్రయోజనాల కోసం, సదరు ప్రభుత్వం వారి ప్రాపకం కోసం సినిమాల్లో భాషను మీరన్నట్లు “తెలంగాణీకరించారు”. వెరసి ఉభయభ్రష్టుత్వం ఆంధ్రాది. ఇబ్బడిముబ్బడిగా ఈ విషయంలో లాభ పడింది తెలంగాణా. వీళ్ళంతా
    మహా ఖుష్. వడ్డించిన విస్తరిలో మరో స్వీటు చిత్ర పరిశ్రమ కూడా ఇక్కడే ఉండిపోవడం.

    ప్చ్, ఆంధ్రుల చరిత్రలో మరొక హిమాలయ తప్పిదం.
    ——————
    అన్నట్లు ఈ బ్లాగరు గారు “గౌతమీ పుత్ర శాతకర్ణి”సినిమా, పలు చిత్రాల్లో చూపించిన శ్రీకృష్ణదేవ రాయల వారి ప్రశస్తి, శ్రీనాథుడు పోతనల జీవిత చరిత్ల, “పల్నాటి యుద్ధం”, “బొబ్బిలి యుద్దం”, “సైరా” వగైరా తెలుగు సినిమాలు కూడా చారిత్రక గాథల మీద ఆధారపడి తీసినవే అని పేర్కొంటే బాగుండేదేమో కదా?

    రిప్లయితొలగించండి
  3. This song is inspired and based on from Dhrupad Hindustani music song Shiv shiv popularised by Gundecha brothers.

    రిప్లయితొలగించండి