Pages

14, జూన్ 2014, శనివారం

తెలంగాణా అభివృద్ది అంటే కేవలం హైదరాబాద్ ని అభివృద్ది చేయడం కాదు.



హైదరాబాద్ ని మినహాయించి చూస్తే తెలంగాణా లోని ఏ జిల్లా సరిగ్గా అభివృద్ది చెందలేదు.దీనికి కారణాలు రకరకాలు.ఇప్పుడు సీమాంధ్ర లో వాణిజ్య,వ్యాపార,పాలనా ,విద్య ఇలాంటి వి వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ది చెయడానికి ఎలా యోచిస్తున్నారో అదేవిధంగా తెలంగాణా జిల్లాలలో కూడా ఆలోచిస్తే మంచిది.మంచిని ఎక్కడున్నా తీసుకోవచ్చు.అలాగే టూరిజం ని బాగా డెవెలప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి.కాని కేరళలో,తమిళనాడు లో అక్కడి ప్రభుత్వాలు,అధికారులు చూపించినంత ఆసక్తిని తెలుగువాళ్ళు చూపించరు.అదే పెద్ద లోటు.కొన్ని దేశాలు టూరిజం వచ్చే ఆదాయం తోనే గొప్పగా ఆర్జిస్తున్నాయి.బౌద్ధ ప్రదేశాలు,జైన ప్రదేశాలు,అడవులు,ఇంకా ఇతర ఆలయాలు ఇలా చూడగినవి ఎన్నో ఉన్నాయి.కాని ప్రమోట్ చేసుకునే విధానాలు మనకి తెలియవు.రాక్షస గూళ్ళు అతి ప్రాచీనమైనవి ఇరు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి.వాటిని ప్రచారం చేసుకోగలగాలి.మన విషయాలని బయటి వారికి చెప్పాలి అనే ఆసక్తి ప్రజల్లో తీసుకురావాలి.అప్పుడు వారు టూరిష్టులకు సహాయకారులుగా ఉంటారు.ఇది అంతా కొన్ని రోజుల్లో జరిగేది కాదు.కాని మనసు పెడితే ఫలితం ఉంటుంది.స్పెయిన్,జర్మనీ,స్విస్,అమెరికా ఇలా ఏ దేశానికి చిన్న ఉత్తరం ముక్క రాసినా వాళ్ళ దర్షనీయ ప్రదేశాల గురించి ఎంతో సమాచారాన్ని వాళ్ళు పంపిస్తారు.ఫోన్ చేసిన చక్కగా చెబుతారు.కాని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నప్పుడు కొన్ని ప్రదేశాల వివరాలు,బ్రోచర్లు కోసం ఎన్నిసార్లు టూరిజం శాఖని ఫోన్ చేసినా చస్తే సమాధానం చెప్పేవారు కాదు.ఇక ఉత్తరాలని ఎక్కడ పారవేశేవారో మరి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి