హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఘోరమైన ప్రమాదం లో ఇంజనీరింగ్ చదువుతున్న తెలుగు విధ్యార్ధులు మృత్యువాత పడటం విచారించవలసిన విషయం.కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం కాసేపు మాట్లాడుకొని ,బాధపడి ఆ తరువాత మర్చిపోవడం జరుగుతున్నది.ఇలాంటి ప్రమాదాలు జరగడానికి గాని,ఇంకా ఇతర క్రమశిక్షణారహిత ప్రవర్తన యువతలో రావడానికి మూలకారణం ఎవరంటే కూడా "కేర్" చేయకపోవడం.మన మధ్యకి ఇటీవల వినోదం పేరిట వస్తోన్న సినిమాలు చూడండి....టీచర్లని,లెక్చరర్లని బఫూన్ లుగా విద్యార్థులు ఆడుకోవటం ఇంకా వాళ్ళు చెప్పే మాటల్ని కాకమ్మ కబుర్లు గా తీసివేయడం...ఇలాంటి సీన్లతో నిండిఉంటున్నాయి.ఇళాంటి బిహేవియర్ నే యువత కూడా గుడ్డిగా అనుకరిస్తున్నది.దీని వల్లనే ...చెప్పినా కేర్ చేయకుండా ప్రవర్తించడం వల్ల నే హిమాచల్ వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక సంఘటన జరిగిన తరువాతశోకాలు పెట్టడం...ఆ తరువాత మరిచిపోవడం..అదీ మన సమాజపు పోకడ.
విద్యాలయాల్లో ఉపాధ్యాయులు వేధిస్తున్నారు అనే పేరు మీద కార్పోరల్ పనిష్మెంట్ ని పూర్తిగా నిషేదించారు.చెప్పుకోవడానికి ఆదర్శపు మాటలు ఎన్నైనా చెప్పుకోవచ్చుగాని...అక్కడి నుంచే వచ్చింది ఈ క్రమశిక్షణారాహిత్యం.విచిత్రంగా మళ్ళీ ప్రయివేట్ కాలేజీ ల్లో గాని,ఇతర కార్పోరేట్ కాలేజీల్లో గాని పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్ళ రిజిస్ట్రేషన్ లు రద్దు చేయడం లాంటి చర్యలు ఉండవు.అసలు కొన్ని ప్రముఖ డైలీ లు కూడ ఆ వార్తని ఎక్కడో మూల ప్రచురిస్తాయి.కారణం ఏడాదికి కొన్ని కోట్ల రూపాయల యాడ్స్ వారిదగ్గరనుంచి రావడమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి