Pages

7, జూన్ 2014, శనివారం

ప్రమాణ స్వీకారానికి లేనిపొని హంగులు ఎందుకు...?



చంద్రబాబు సీమాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కొన్ని చానెళ్ళు పట్టాభిషేకంగా వర్ణించడం,ఇంకా ఆ ప్రముఖులు వస్తున్నారు.. ఈ ప్రముఖులు వస్తున్నారు... అంటూ ఊదరగొట్టడం చూస్తుంటే ఎంత అమాయకత్వం...లేదా అతి తెలివి అనిపించకమానదు. ఒక ప్రధాని అంటే..వివిధ దేశాలతో అనేక  విషయాలు  శాంతిభద్రతలు వ్యాపార వాణిజ్యాలు వంటివి  చక్కబెట్టే అవసరం ఉంటుంది గాబట్టి అనేక ఇతర ప్రముఖుల్ని రప్పించడానికి కృషిచేయడంలో అర్ధం ఉంది.రాష్ట్రాలలో అనవసరమైన ఖర్చులు ప్రమాణస్వీకారానికి పెట్టడం అనేది మనకి తెలిసీ ఎక్కడా ఉండదు.ఇప్పుడు ప్రతి రూపాయి సీమాంధ్రకి అవసరం.అటువంటి క్లిష్టపరిస్థితి ఇప్పుడు. ఘనంగా ప్రమాణస్వీకారం చేసినంతమాత్రాన వ్యాపారులు పెట్టుబడి పెట్టడానికి రారు.అంత అమాయకులు కారు వాళ్ళు. మోడీ గాలి,పవన్ కళ్యాణ్ గాలి,సోనియా ఎదురు గాలి ఇలాంటివన్నీ అన్నీ కలిసి చంద్రబాబు ని గద్దెనెక్కించాయి.అది మరిచిపోయి అతి విశ్వాసం తో ముందుకు  పోతే ఫలితాలు తిరగబడే అవకాశం ఉంది.సాధ్యమైనంతవరకు ఎంత తొందరగా హైదరాబాద్ ని విడిచిపెట్టి బయటికి వస్తే అంతమంచిది.ఏ అభివృద్ది జరగాలన్నా...అంతకుమించి మార్గం లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి