ముగ్గురు ...మూడు తరాలు!వాళ్ళ... సరదా కోసం సినిమా తీసుకున్నారు.ఆ కధ లో హేతువు కోసం వెతికేతే పిచ్చి ఎక్కటం ఖాయం.ప్రపంచం లో ఎక్కడైనా ఇలా జరిగిఉంటుందా అని ప్రశ్నించుకోకుండా హాయిగా అక్కినేని కుటుంబాన్ని చూసి ,కొత ఎంటర్టైన్మెంట్ పొంది రండి. అంతకుమించి ఆలోచిస్తే మీ సమయం వ్యర్ధం.చివరికి అక్కినేని నాగేశ్వర రావు చివరి దశని కూడా ఇలా ఎన్ కేష్ చేసుకున్నారా అనిపిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు.
చాన్నాళ్ళ తరవాత శ్రేయ కొంత పల్చబడ్డా అందంగా కనిపించింది.ఆక్సిజన్ ఏమైనా వస్తుందేమో చూడాలి.నాగ చైతన్య సినిమా జెనిక్ ఫేసా అని ఆలోచించుకోవలసిన తరుణం వచ్చింది.మా సినిమాలు..మాడబ్బులు అనుకుంటే మనం చేయగలిగేది ఏమీ లేదు.అఖిల్ కి మహేష్ బాబు లాంటి భవిష్యత్తు ఉండినా ఆశ్చర్యం లేదు.సినిమాటిక్ ఫేస్ ..నూరుపాళ్ళు.డిటో అమల ఫీచర్స్ ఉన్నాయి.ఎంతైనా ఐరిష్ రక్తం కూడా ఉంది కదా..!అందంగా ఉన్నాడు.
ఒకసారి చూస్తే పెద్ద నష్టం ఏమీ లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి