Pages

3, జూన్ 2014, మంగళవారం

అసలిప్పుడు ఏ సినిమాలో ఏ పాట ఎవరు పాడుతున్నారో నాకర్ధం కావడం లేదు.



ఈ డవుట్ నా ఒక్కడికేనా...ఇంకా ఎవరికైనా వస్తున్నదా..?కనీసం ఓ సంవత్సరం లో ఓ పది పాటలైనా సూపర్ హిట్ అయ్యేవి.ఆ సినిమా పాటల్లోని సంగీతం వల్లగాని,సాహిత్యం వల్లగాని ఎప్పటికి వినగలిగేలా అవి ఉండి పోయేవి.ఇప్పుడొచే పాటల్లో ఆ బాణీలు ఏమిటో గాని ఒకసారి వింటే ఇంకోసారికి విరక్తి కలుగుతున్నాయి.పాటల రచన కూడా అరకొరగా ఉంటున్నాయి.ఏవో సోది మాటల్ని ఒక ట్యున్ లో పెట్టినట్లు ఉంటున్నాయి.ఏ రసమూ పొంగటం లేదు.అంత గాలిగా ఉంటున్నాయి.ముఖ్యంగా చెన్నై నుంచి చిత్రసీమ హైదరాబాద్ వచ్చినాక బ్రోకెన్ ఉర్దు ముక్కలు కొన్ని,కొన్ని అరకొర ఇంగ్లీష్ ముక్కలు ,ఇంకొన్ని తెలుగు ముక్కలు కలిపి అర్ధం పర్ధం లేని పాటలు వస్తున్నాయి.ఒక్క హైదరాబాదీ లను దృష్టి లో పెట్టుకొని వండినట్లు ఉంటున్నాయి.ఈ మధ్య ఓ సినిమా వచ్చింది...ప్యార్ మే పడిపోయానే అట.ఏమిటా సంకర భాషా ప్రయోగాలు.వినడానికే అసహ్యంగా ఉంటున్నాయి.కనీసం సీమాంధ్ర రాజ్యం  లో నైనా మంచి  సంగీత సాహిత్యాలుగల పాటలు వస్తాయని ఆశిద్దాం.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి