ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేవలం తమ చరిష్మా వల్లనే తాము గెలిచామనుకొంటే అంతకు మించిన పొరబాటు ఉండదు.సీమాంధ్ర లో జనాలు విభజన వల్ల కలిగిన ఈసడింపు తో కాంగ్రెస్ ని,జగన్ ని కాదని బాబు కి ఎక్కువ ఓట్లు వేశారు.సరే శాతం ఎంతైనా గాని గెలవడం ముఖ్యం కదా.ఆ విషయాన్ని గుర్తుంచుకొని కొత్త రాజధానిని నిర్మించడం లో శక్తి మేరకు అభివృద్దిచ్చాయల్ని చూపించాలి.మిగతా పట్టణాల్ని సైతం ముందుకు తీసుకుపోవాలి.
అలాగే కెసీఅర్ కి కూడా ..! కాంగ్రెస్ తనకి ప్రయోజనం కలుగుతుందన్న ఆలోచన తోనే తెలంగాణా ఇచ్చింది తప్ప అమరులైన వారిని చూసి కాదు అనేది గుర్తెరిగి టి ఆర్ ఎస్ ని తెలంగాణా ప్రజలు గెలిపించారు.చెప్పిన వాగ్దానాల లో కొన్నైనా కెసీఅర్ చేసిచూపించాలి.
అది వదిలి తమకి ఉన్న మీడియా ద్వారా బాజాభజంత్రీలు మోగించుకుంటూ కాలం గడుపుదామనుకుంటే అప్పటిలా కుదరదు.జనాలు తెలివి మీరారు.రాసింది చదివి ప్రతీది బేరీజు వేసుకుంటున్నారు.ఏ పత్రిక,ఏ చానల్ ఎవరికి భజాయిస్తుందో ఇప్పుడు చిన్నపిల్లలు చెప్పగలరు.అలాకాదని అతి సొంత ఎజెండాలతో ముందుకు పోతే ఇటూ అటు సోనియా కాంగ్రెస్,జగన్ కాంగ్రెస్ లు మళ్ళీ పుంజుకోవడం ఖాయం.అంతకు మించి ప్రత్యామ్నాయం ఏముంది...?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి