Pages

28, మే 2014, బుధవారం

విక్రమ సింహ సినిమా పై నా రివ్యూ



యానిమేషన్ సినిమా మామూలు నటులు నటించినట్లుగా ఎందుకుంటుంది అనుకొని వెళ్ళాను.సరే చూద్దాం ఎలా ఉందోనని.కార్టూన్ లను చూస్తున్నట్లుగా నే ఉంది.అంత ఖర్చు పెట్టాం అని చెప్పొచ్చు గాక..కాని జనాలకి అనిపించేది మాత్రం అదే.అయితే ఒకటి... తీసుకున్న స్టోరీ లైన్ బావుంది.సెంటిమెంటు బాగానే పండింది కధలో.అయితే కధ తమిళ నేపధ్యం లోది.కాబట్టి వాళ్ళుకొంత ఎక్కువ కనెక్ట్ అయి ఉండవచ్చు.

మన దగ్గర మాత్రం రిపీటెడ్ ఆడియన్స్ రావడం కష్టమే.ఇంగ్లీష్ లో ఆమధ్య గ్రీక్ కధల ఆధారంగా 3డి యానిమేషన్ సినిమాలు రెండు వచ్చాయి.అవి చూసినంత ఎఫెక్టివ్ గా ఇది అనిపించలేదు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి