Pages

17, అక్టోబర్ 2014, శుక్రవారం

అసెంబ్లీ అంటే కుటుంబాల సొత్తా....ఒకరు మరణిస్తే వెంటనె వారి కుటుంబ సబ్యులకి సీటు కేటాయించడానికి..?



ఈ పరమ నికృష్ట సంప్రదాయానికి చరమ గీతం పాడవలసిన అవసరం ఉంది.అది ఏ పార్టీ వాళ్ళు గాని భార్యో,భర్తో ఇంకొకరో మరణిస్తే వెంటనే వారసత్వం లాగా ఆ ఫేమిలీ లో కేటాయించడం పైగా ఇతరులు పోటీ పెట్టకుండా ఉండాలని కోరడాలు.ఇది ప్రజాస్వామ్యమా.. కుటుంబస్వామ్యమా లేక అల్లటప్పా యవ్వారాలా..! ప్రజస్వామ్యం అంటే కేవలం మన వారి దృషి లో ఒకటే ..తమ ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు అడ్డుపెట్టుకొని చేసే రాజకీయం.అసలు మన దేశం లో ప్రజాస్వామ్యం అనే మాట ని రాజ్యాంగం లో రాసుకున్నాం గాని దాని అర్ధం ఎవరికైనా తెలుసా..లేదా తమ వర్గాలకి మేలు జరుగుతున్నంతకాలం తెలిసినా పట్టించుకోరా..?అరువు తెచ్చుకున్న మాటల్లోని భావం అర్ధం చేసుకోలేని ప్రజలున్నంత కాలం,తెలిసినా సంకుచిత ప్రయొజనాల కోసం ప్రశ్నించలేని మీడియా ఉన్నంత కాలం ఈ డెమొక్రసీ అనే డ్రామా ఇలా నడిచిపోతూనేఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి