Pages

18, అక్టోబర్ 2014, శనివారం

" గోవిందుడు అందరి వాడేలే" సినిమా పై నా రివ్యూ..!



కృష్ణవంశీ కధనం ఒక మాదిరిగా ఉంది.సీతారామయ్య గారి మనవరాలు షేడ్స్ పరోక్షంగా ఉన్నాయి.పాత్రల్ని కొంచెం కొత్తగా సృష్టించడం లో అతని పనితనాన్ని మెచ్చుకోవచ్చు.అయితే బయట నిజంగా మన తెలుగు పల్లెల్లో అంత లేసి ప్రేమ బాంధవ్యాలు ఉన్నాయా.అనుమానమే.

విడిపోయిన కుటుంబాన్ని కలపడం ..ఇతివృత్తం అదే.చరణ్ లోని మరో కొత్త కోణాన్ని సినిమా చూపించింది.సినిమా హిట్ అవుతుందో..ఫట్ అవుతుందో చెప్పలేము గాని సినిమా పరంగా అతనికి జరిగిన మేలు అది.కాజల్ యధాప్రకారం అందాల్ని ఆరబోసింది.యువన్ శంకర్ రాజా సంగీతం లో రెండు పాటలు బాగున్నాయి.గతం లోని కృష్ణవంశీ సినిమాల్లోని పాటల రేంజి లో అయితే లేవు.సినిమాటోగ్రఫీ బాగుంది.కోట శ్రీనివాసరావు,శ్రీకాంత్ ,పరుచూరి తమ పాత్రలకి న్యాయం చేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి