Pages

16, సెప్టెంబర్ 2026, బుధవారం

వరవు (మళయాళం సినిమా)

ఇటీవల అనుకోకుండా జీ5 లో ఒక మళయాళం సినిమా చూశాను. వరవు దాని పేరు.జోజు జార్జ్ హీరో. షాజీ కైలాస్ దర్శకుడు.ఈ జోజు జార్జ్ సినిమాలు గతం లో కొన్ని చూశాను.సహజం గా బాగుంటాయి.మనిషి రఫ్ గా ఉన్నట్లు కనిపించినా అన్నీ రసాలు బాగా పండిస్తాడు. ఈ సినిమా క్రైం థ్రిల్లర్ అని చెప్పాలి. కేరళ లోని ఒక గ్రామం లో జరిగే కథ. పెరోల్ మీద వచ్చిన జోజు జార్జ్ ని చంపడానికి కొంత మంది చంపడానికి ప్రయత్నం చేస్తుంటారు.

దానికి కారణాలు ఏమిటి,జార్జ్ గతం ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపి ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిన విలన్ ని హీరో ఎలా మట్టి కరిపిస్తాడు అనేది ఆసక్తిదాయకం గా ఉంటుంది.విలన్ గా చేసిన మురళీ గోపి ఎక్కువ మాకులు కొట్టేసాడు అని చెబితే అతిశయోక్తి కాదు. ఫోటోగ్రఫీ సూపర్ గా ఉంది.సినిమా ఎక్కడా విసుగు అనిపించదు.వాణీ విశ్వనాథ్,సుకన్య లాంటి తెలిసిన ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు. వీలైతే ఓటిటి లో చూడవచ్చు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి