ఇదేదో రెగ్యులర్ గా వచ్చే తమిళ్ డబ్బింగ్ సినిమా అనుకుని కాస్త ఆలశ్యంగా చూశాను.అదీ ఒక మిత్రుని సలహా మేరకు. చూసిన తర్వాత చాన్నాళ్ళకి ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఈ సినిమా లో చెప్పాలంటే కథ యే మొదటి హీరో. అసలు తమిళనాడు లోని మత్స్యకారులు,వాళ్ళ జీవనం ,పడవ పందాలు తీసుకుని ఒక చక్కని కథ అల్లిన ఈ సినిమా కథకునికి,దాన్ని చక్కగా తెరకి ఎక్కించిన దర్శకుడు మదిమారన్ పుగళేంది కి హేట్సాఫ్ చెప్పాలి.
డబ్బింగ్ వెర్షన్ లో కథ ని కళింగసీమ కి ఆపాదించిన వైనం పడుగూపేక లా కలిసిపోయింది.సూరి,సుహాస్ పాత్రలకి జీవం పోశారు. గొప్ప సెట్టింగులు,మిరుమిట్లు గొలిపే కాస్ట్యుంలు, లేనిపోని చెత్త ఎలివేషన్లు లేకుండా ఒక ప్రాంత జీవితాన్ని నూతనంగా ఆవిష్కరించితే ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడతారో ఈ మండాడి చిత్రమే ఒక ఉదాహరణ.
ప్రతి వృత్తి లోనూ ఎన్నో తెలుసుకోవలసిన అంశాలు ఉంటాయి. తెల్లారి లేస్తే, సుడిగుండాలు ఏర్పడినపుడు మత్స్యకారుల కోసం మీడియా హెచ్చరికలు ఇవ్వడం చదువుతూ వింటుంటాం.కాని అలాంటి మత్స్యకారుల జీవితాల్లో ఎలాంటి ఆసక్తికరమైన,సాహసోపేతమైన ఘట్టాలు ఉంటాయో అందమైన సినిమా కథ గా మనకి చూపించినది ఈ మండాడి.
తాజాగా అందుతున్న వార్తల ప్రకారం 125 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. దీని కథ ని అనుభూతి చెందాలంటే ఎలాంటి ఎక్స్పెక్టషన్స్ లేకుండా వెళ్ళి చూడండి.అంతే.

.jpg)
.jpg)



