వేట్టై అనే తమిళ్ మాతృక నుంచి తీసుకున్న కధ కాబట్టి ఆ తమిళ రక్త సంబంధం సెంటిమెంటూ..బోరు కొట్టని కధా గమనం సినిమాకి కొంత మేరకు సహకరించాయి.మనం అనుకుంటాం గాని రక్త సంబంద సెంటిమెంటుకి ఇండియా లో ఎప్పుడు స్థానం వుంటుంది.కాకపోతే కధనం తలనొప్పి తెప్పించకూడదు.మరి హాస్యం బాగుండాలి.పాటలు బాగుండాలి.ఇక తిరుగుండదంతే..!
ఈ సినిమా కధ ఇప్పటికే చాలా మందికి తెలిసిపోయింది గనక ఇంకా సోదిపెట్టదలుచుకోలేదు.ఇద్దరు అన్నదమ్ములు. ఒకరు అమాయకుడు.ఇంకొకరు మాయకుడు.దాని మద్య అల్లబడిన కధ స్థూలంగా చెప్పాలంటే..!సరే విలన్ అషుతోష్ రాణా అని చెప్పి ఓ హిందీ బాబు.
సునీల్ అమాయకుడు గా బాగానే మెప్పించాడు.అతనికి జోడిగా ఆండ్రియా జెర్మియా ఆకర్షణీయంగా వుంది.ఏ మాట కామాట చెప్పాలంటే అలా బక్కగా ఆరిపోయినట్టుగా వుంటే అదేదో contest లకి ఓకే నేమో గాని మన దక్షిణాది వారికి ఆడవాళ్ళంటే ఓ మోస్తరు కండ పట్టి వుంటేనే ఇష్టం.
తమన్నా భాటియా సొగసులారబోసింది.నాగ చైతన్య డైలాగ్ చెబుతున్నపుడు అతని పై పెదవి చాలా వికృతంగా కనిపించి ఆ డైలాగ్ అర్ధాన్ని మార్చి వేస్తుందని చెప్పాలి.అతను ఆ డిఫెక్ట్ ని ఆపరేషన్ ద్వారా తొలగించుకోవచ్చుననుకుంటాను. వున్నది షో బిజ్ లో కాబట్టి చెప్పక తప్పదు.
బ్రహ్మానందం హాస్యం పెద్దగా నవ్వు తెప్పించలేదు సరికదా చాల కృత్రిమంగా వుంది.వెన్నెల కిషొర్ ఆ లోటు కొంత తీర్చాడు.సంగీతం యావరేజ్ గా వుంది. మరీ ఫ్లాప్ అని చెప్పలేము.అలాగని సూపర్ హిట్ అని చెప్పలేము.ఒక మాదిరిగా వుంది సినిమా..!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి