Pages

28, మే 2013, మంగళవారం

మన వాళ్ళెందుకని తెలుగులో పెట్టినట్టుగా ఇంగ్లీష్ లో పత్రికలు ..చిన్నవైనాసరే పెట్టరు

మన వాళ్ళెందుకని తెలుగులో పెట్టినట్టుగా ఇంగ్లీష్ లో పత్రికలు ..చిన్నవైనాసరే పెట్టరు.నేను ఏ జిల్లా వెళ్ళినా అక్కడ బస్ స్టాండ్ లో గాని రైల్వే స్టేషన్ లో గాని చిన్న పత్రికలు weekly లు గాని  పక్ష పత్రికలు గాని చాలా చూస్తుంటాను.మరి ఇంగ్లీష్ లో ఎందుకని ఎక్కువగా కనిపించవు..!ఇంగ్లీష్ లో అయితే ఎక్కువగా చదవరనా..?ఎందుకో నమ్మలేను..ఇప్పుడేవరిని చూసినా ఇంగ్లీష్ మీడియెం లోనేగా చదివేది..!intermediate ని కూడా లక్షలు కుమ్మరించి corporate కాలేజిల్లోనేగా పిల్లలని చదివించేదీ..! టి.వి.ల్లో చూసినా ప్రతి ఒక్కరూ మేము తెలుగులో చాలా poor ..ఇంగ్లీష్ లో నైతేనా అన్నట్టుగా style గా మాట్లాడుతుంటారు.

ఆ మధ్య ఒరిస్సా రాష్ట్రం వెళ్ళాను.నిజానికి కొన్ని రంగాల్లో మనకంటే ఆ రాష్ట్రం వెనుకబడినదనే చెప్పాలి.అయితే విచిత్రంగా చిన్న ఇంగ్లీష్ పత్రికలు చాలా అక్కడ చూశాను.పూర్తిగా వార్తల్ని ప్రచురించే "న్యూస్ పోర్టల్స్" కూడా గణనీయంగా వున్నాయి.తెలుగు మీద అభిమానం వల్ల ఇంగ్లీష్ పత్రికలు రావడం లేదనడం పూర్తిగా నిరాధారం.ఇంకా కుంటి వాదన కూడా..!

నాకు అనిపించిది ఏమంటే ఒక తెలుగువాడు  ఇంగ్లీష్ పత్రికని సరిగా నడపలేడని నమ్మడమే..!ఒక వేళ ఏ తెలుగు యాజమాన్యం దానికి సాహసించినా దానికి editor గా ఒక మళయాళీనో...తమిళున్నో...బెంగాలీ నో పెడతారు.అంత నమ్మకమన్నమాట మన మీద మనకి.

తెలుగు వాళ్ళలో ఇంకొక మూఢ నమ్మకం ఏమిటంటే...ఇంగ్లీష్ లో (పత్రికల్లో) అవసరమున్నా లేకపోయినా ఎంత అర్ధం కాని పదాడంబరాన్ని ఉపయోగిస్తే అంత గొప్పగా అనుకోవడం. చిన్న పదాల్లోనే చక్కని expression తేవచ్చు.కొంతమది అంటుంటారు..అబ్బ Hindu లాంగ్వేజ్ చాలా కష్టంగా..standard గా వుంటుంది అని. నా మటుకు నాకు తమిళ expression బాగా కనబడుతుంది దానిలో..!

నిజ జీవితంలో కూడా ఇంగ్లీష్ పత్రికల్ని ఎక్కువగా..అంటే తమ స్వంత భాషలాగే చదివే వీలునప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోడానికి ప్రత్యేకంగా ఏ క్లాసులకి వెళ్ళకుండానే చాలా ఈజీ గా ఆ భాష వస్తుంది. భాషేతరులకి మన గూర్చిన సంగతులని అందించడం అనేది ఆంగ్ల భాష వల్లనే సాధ్య పడుతుంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి