మెహెర్ రమేష్ టాలెంట్ ని ఓ రకంగా గుర్తించవలసిందే..!శక్తి సినిమా దగ్గర్నుంచి అలుపూ సొలుపూ లేకుండాచక్కని ఫ్లాప్ లు నిర్మాతలకిస్తున్నా అతనికి సినిమా ఆఫర్లూ వస్తూనే వున్నాయంటే అతగాడిలో యేదో టాలెంట్ బాగానే వుంది.
చక్కగా ఏదో ఫేమిలీ టైప్ చిత్రాలు తీసుకొంటూ కాలం అలా దొర్లించుకొస్తున్న వెంకటేష్ ఈసారి షాడో అవతారం ఎత్తాడు.సినిమా first half మొత్తం మలేషియాలోనే జరిగిపోతుంది.అక్కడ డాన్ వుంటాడన్న మాట.ఆయన ఓ ఇరవై ఏళ్ళ క్రితం హీరో కుటుంబాన్ని నాశనం చేయగా ...ఆయన్ని వెతుక్కుంటూ మన షాడో వెళ్ళి ఆ విదేశం లో ఊచకోత మొదలెడుతుంటాడు.
వెంకటేష్ అసలే కోట్లు మీద కోట్లు వేసేస్తూ ఓవర్ డ్రెస్సింగ్ తో రెచ్చిపోయాడు.Hair style కూడా మార్చి పారేశాడు.మెహెర్ రమేష్ గొప్పతనం ఏమిటంటే అసలేమాత్రం సస్పెన్స్ అనేది సినిమాలో లేకుండా చూసుకున్నాడు.జరగబోయే సన్నివేశాలని చిన్న పిల్లాడు కూడా హాయిగా వూహించగలడు.
M.S. నారాయణ కామెడి సోసో గా వుంది.విదేశాల్లో మన డాక్టర్ లు ఎవరైనా అలా అంత ఫూలిష్ గా బిహేవ్ చేస్తే దేశానికే చెడ్డ పేరు వస్తుంది.మధు బాబు యొక్క షాడో ని వూహించుకుని ఈ షాడో కెళితే దిమ్మతిరగడం ఖాయం.
ఖర్చు పెట్టడం లో వున్న శ్రద్ద కధ మీద ..screenplay మీద పెడితే బాగుండేది.తాప్సీ అందాలు యధాశక్తి ఆరబోసింది.సంగీతం ఒక మాదిరిగా వుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి