చాలా రివ్యూలు చదివిన తరవాత..ఇంకా కొంత నోటి మాటల్ని బట్టి ఓసారి చూడాలనిపించి బాద్షా కి వెళ్ళాను.అయితే నేను చదివిన వాటిల్లో..విన్నవాటిల్లో మిక్సుడ్ టాక్ వుంది..! సరే మనకెలా అనిపిస్తుందో చూద్దామని వెళ్ళాను.ఫోటోగ్రఫీ నీట్ గా వుంది.దుస్తులకి,లొకేషన్లకి చాల ఖర్చు చేసినట్టుగా అనిపించింది.పాటలు ఒకటి రెండు పరవాలేదు.catchy గా తోచాయి.
మరింతకి సినిమా ఎలా వుంది అంటారా ...ఆ వస్తున్నా అక్కడికే..!ఈ మద్యనొచ్చే ప్రతి సినిమాలో ఒక డాన్ తప్పనిసరి గదా..ఒకోసారి ఏ సినిమాలో ఏ డానో గుర్తుండి చావడం లేదు. ఆ ఈ డాన్ హిందీ వాడే..మరప్పుడే రిచ్ లుక్ వస్తుందన్నమాట.నాకు తెలవక అడుగుతా ఒక వ్యక్తి పెద్ద నెట్వర్క్ గల డాన్ ని మట్టు బెట్టడం అంత వీజీయా..! అలాయితే D కంపెనీ ఎప్పుడో మూత బడాలి.
కనీసం సరదాకైనా ఒకసారి God Father నవలని గాని...Sicilian లాంటి నవలని గాని మన దర్శకులు చదివితే బాగుంటుంది.ఆ సినిమాలు చూడటం గాదు...చదవడం వల్లనే UNDERWORLD కార్యకలాపాలు ఏ విధంగా చాపకింద నీరులా జరుగుతుంటాయో తెలుస్తుంది.కేవలం హింస...బెదిరించడం లు మాత్రమే కాదు జనసామాన్యం యొక్క...అధికార శక్తుల యొక్క అంతరంగాన్ని పసిగట్టి organised గా పనిసాగించడంలో నిపుణులుగా వీరు వుంటారు.
Last resort గా మాత్రమే ఒకరి ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తారు.
మన డాన్ ల పాత్రలని తీర్చిదిద్దే తీరు చూస్తే మన తెలుగు దర్శక ,హీరోల పైత్యం తప్ప ఇంకా యేమి కనిపించదు.అసలు ఎంతోకొంత study చేసి సినిమా తీయాలి అనే concept మనకెక్కడ వుంది...!
ఇక inception యొక్క thought ని ఈ సినిమాలో వాడుకున్న వైనం ఘోరాతి ఘోరం...! అసలు ఈ సినిమాకి ప్రాణం పోసింది బ్రహ్మానందం అని చెప్పాలి.పిల్లి వంశం హడావుడి పేలవంగా వుంది.
మాఫియా ని మట్టుబెట్టడానికి దాంట్లో హీరో చేరడం కూడా హాస్యాస్పదంగా వుంది.శ్రీను వైట్ల కొత్త కామెడీ ట్రాక్లు వెతుక్కోవాలి.అరిగిపోతున్నాయి మరి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి